వైరల్ వీడియో: సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న కొత్తరకం డాన్స్..!

మన భారతదేశంలో ఎన్నో రకాల నృత్యాలు పేరు పొందినాయి.కళలకు పుట్టినిల్లు అయిన భారతదేశంలో భరత నాట్యం ఎంతో ప్రాముఖ్యం చెందింది.

వేల మంది కళాకారులు ఈ నాట్యం నేర్చుకుని వివిధ దేశాలలో భరత నాట్య ప్రదర్శనలు ఇస్తూ పేరు తెచ్చుకున్న వారు ఎందరో.మన భారతదేశంలో భరతనాట్యం ఏ విధంగా ఫేమస్ అయ్యిందో అమెరికా దేశంలో హిప్-హాప్ అనే డాన్స్ కూడా అంతే ఫేమస్.

అయితే ఓ ఆంగ్లో-ఇండియన్ కొత్తగా ఆలోచించి భరతనాట్యాన్ని హిప్-హాప్ రెండింటిని మేళవించి ఓ కొత్త రకమైన డాన్స్ ను ప్రదర్శించారు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

వీటికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.భారతదేశ చీరకట్టుతో, మరోవైపు అమెరికన్ వస్త్రధారణ కలగలిపి ఉండేలా వస్త్రధారణ చేసుకొని ఈ డాన్స్ కు కొత్తదనం మేళవించారు.

Advertisement

ఉష అనే మహిళ తన మిత్రురాలితో కలిసి ఈ కొత్తరకం డాన్సును సోషల్ మీడియా ను ఫ్లాట్ఫామ్ గా చేసుకొని ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తున్నారు.ఉష ఆమె ఫ్రెండ్ ఓర్లేన్ భరతనాట్యం, హిప్-హాప్ సాంగ్స్ కలిపి ఓ కొత్త డాన్స్ వీడియో ను రూపొందించారు.

ఇక ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది కాస్తా బాగా వైరల్ గా మారింది.అయితే ఈ డాన్స్ చూడడానికి చాలా కొత్తగా అనిపిస్తుంది.

దీన్ని చూసి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.నిజానికి భరతనాట్యం, హిప్-హాప్ డాన్సు రెండు వేరు వేరు రకాల నృత్యాలు.

అంతేకాక భారతదేశ సాంప్రదాయబద్ధంగా జరిపే డాన్స్ ఒకటి, మరొకటి అమెరికా దేశంలో కుర్రకారు ఉర్రూతలూగించే చేసే డాన్స్ ఒకటి.కానీ, ఉష తన స్నేహితురాలు మాత్రం ఈ రెండింటిని ఒక చోటికి తీసుకు వచ్చి వాటిని కలిపి డాన్సులు చేయడం నిజంగా అబ్బురపరిచే విషయం.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

వీరు డాన్స్ చేయడమే కాదు అందరితో శభాష్ అనిపించుకొనేలా ఈ డాన్స్ చేయడం నిజంగా అభినందించే విషయమే.ఇక ఈ వీడియోకి ఉష " హైబ్రిడ్ భారతం " అని పేరు పెట్టి పోస్ట్ చేసింది.

Advertisement

గత రెండు నెలల నుంచి ఆవిడ యూట్యూబ్ లో ఒక ఛానల్ మొదలు పెట్టి అందులో ఈ వీడియోలు పోస్ట్ చేస్తూ వస్తోంది.ఇక ఈ విషయంపై ఉష స్పందిస్తూ తనకు భరత నాట్యం పట్ల తనకి ఎనలేని ప్రేమ ఉందని.

కాకపోతే, తానేమి భరతనాట్యంలో నిపుణురాలుని కాదని తెలుపుతూనే తాను రెండు డిఫరెంట్ జోనర్ లకు సంబంధించి నృత్యం తయారు చేయడం పట్ల సంతోషంగా ఉన్నట్లు తెలిపింది.

తాజా వార్తలు