వీడియో వైరల్: దారుణం.. మహిళ జుట్టును పట్టుకొని రక్తం వచ్చేలా కొట్టిన కారు ఓనర్..

తాజాగా పూణే( Pune ) నగరంలో ఓ దారుణ సంఘటన చోటుచేసుకుంది.

రోడ్డుపై వెళ్తున్న మహిళ పట్ల ఒక్క కారు లోని వ్యక్తి దారుణంగా వ్యవహరించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

మహిళలతోపాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారని కూడా ఆలోచించకుండా కారులో నుంచి వచ్చిన వ్యక్తి మహిళపై దారుణంగా ప్రవర్తించిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.మహిళపై దాడి చేయడంతో మహిళ ముక్కు పగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది.

ఈ ఘటనతో ఆవిడకు జరిగిన అనుభవాన్ని వీడియో ద్వారా తెలిపి ఆ వీడియోను కాస్త సోషల్ మీడియా( Social media ) ద్వారా పోస్ట్ చేయడంతో విషయంపై కారు ఓనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ జరుపుకున్నారు.ఇక్కడ విశేషం ఏమిటంటే.

దాడి చేస్తున్న సమయంలో కారులో ఆ వ్యక్తి భార్య కూడా కారులోనే ఉండడం విశేషం.ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.

Advertisement

పూణే నగరంలోని 27 ఏళ్ల ఓ మహిళ తన ఇద్దరు పిల్లలు కలసి స్కూటీ పై వెళుతున్న సమయంలో బనేర్ ఫ్యాషన్ రోడ్డుపై వెళ్తుండగా స్వప్నిల్ అనే వ్యక్తి ఆమె స్కూటీపై వెనకాలే కారులో వస్తున్నాడు.అదే సమయంలో కారులో అతనితో పాటు మరొక వ్యక్తి, దాడి చేసిన వ్యక్తి భార్య కూడా ఉన్నారు.కొద్దిసేపు స్కూటీ వెనకాలే వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా స్కూటీని ఓవర్టేక్ చేసి స్కూటీ ముందుగా నుంచి దిగిన స్వప్నిల్ వేగంగా మహిళ వైపుకు దుసుకోచ్చాడు.

దాంతో ఒక్కసారిగా అతను మహిళపై పిడుగులతో విరుచుకబడ్డాడు.ఆ సమయంలో అసలు ఏం జరుగుతుందో.అర్థం కాలేదు ఆ మహిళకి.

పక్కన ఇద్దరు పిల్లలు ఏడుస్తున్న కానీ.ఆ వ్యక్తి ఏం పట్టించుకోకుండా ఆమె పైకి దాడి చేశాడు.

దాడిలో ఆమెకి ముక్కు పగిలి రక్తస్రావం అయింది.తనకు జరిగిన ఘటనను ఆ మహిళ వీడియో తీసి.

స్టార్ హీరో ప్రభాస్ అలా చేయడంతో గూస్ బంప్స్ వచ్చాయి.. ఫైట్ మాస్టర్ కామెంట్స్ వైరల్!
సీతారకు మహేష్ దంపతుల బర్త్డే విషెస్.. వైరల్ పోస్ట్..

సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.ఇక వీడియో వైరల్ కావడంతో ఈ ఘటనపై పోలీసులు( police ) కేసు నమోదు చేసి మహిళల నుంచి పూర్తి వివరాలను సేకరించారు.

Advertisement

దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.

తాజా వార్తలు