వైరల్ వీడియో: రకరకాల పండ్లు ఒకేచోట కనిపించడంతో ఆ ఏనుగు ఏం చేసిందంటే..?!

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ , సమాజంలో చిన్న పిల్లవాడి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియా వినియోగం సర్వ సాధారణం అయిపోయింది.

ఈ క్రమంలో మనం నిత్యం ఇంటర్నెట్ లో పక్షులు, జంతువులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.

అందులో కొన్ని వీడియోలు, ఫోటోలు అందరిని ఆనందాన్ని కలిగించేవి అయితే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి.తాజాగా ఒక ఏనుగు ఆహారం తింటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

వీడియో నెటిజెన్స్ ను కూడా ఎంతగానో ఆ వీడియో అక్కటుకుంది.సాధారణంగా ఏనుగులకు పండ్లు అంటే చాలా ప్రీతికరం.

అదే రకరకాల పండ్లు ఒకే చోట కనిపిస్తే ఇక ఆ ఏనుగులకు పండగే కదా.అచ్చం అలాగే వివిధ రకాల పండ్లు ‘బబుల్స్’​ అనే ఒక ఆఫ్రికన్ ఏనుగు ఆస్వాదిస్తూ ఆరగించడం చూసిన ఓ వ్యక్తి వీడియోను తీసి సోషల్ మీడియా ద్వారా షేర్ చేశాడు.

Advertisement

ఏనుగుల అంటే ఎంతో ఇష్టపడే వారికీ ఈ వీడియో ఎంత గానో ఆకట్టుకుంటుంది.వాస్తవానికి ‘బబుల్స్’ అనే ఒక ఏనుగు అనాధ.30 సంవత్సరాలుగా భగవాన్ అనే వ్యక్తి ఆ ఏనుగు యోగక్షేమాలు అన్నీ చూసుకుంటూ, దాన్ని సొంత మనిషి లాగా చూసుకుంటున్నాడు.ప్రస్తుతం మాత్రం ఆ ఏనుగు వివిధ పండ్లను తింటున్న వీడియో వైరల్ అవుతుంది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Advertisement

తాజా వార్తలు