వైరల్ వీడియో: రైల్వే ఉద్యోగి అవతారం ఎత్తిన కోతి.. ఏం చేసిందంటే..

కోతులను( Monkey ) మనుషుల తర్వాత అత్యంత తెలివైన వాటిగా పరిగణిస్తారు.ఇవి చాలా వరకు మనుషులు లాగానే ప్రవర్తిస్తాయి.

 Viral Video: A Monkey Impersonating A Railway Employee What Did He Do , Latest N-TeluguStop.com

అలాగే తెలివిగా నడుచుకుంటాయి.వీటి స్మార్ట్‌నెస్ ను చూపించే వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.

తాజాగా ఆ కోవకు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై చాలా మందిని ఆకట్టుకుంటోంది.ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ కోతి కంప్యూటర్ ముందు కూర్చొని ఒక డెడికేటెడ్ ఎంప్లాయ్ లాగా పని చేస్తూ ఉండడం చూడవచ్చు.

ఈ కోతి కంప్యూటర్ ముందు మనిషిలాగా కూర్చుని కీబోర్డ్( Keyboard ) పై టైప్ చేయడం చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.

@the_heavy_locopilot అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు తాజాగా పంచుకున్న ఈ వీడియో లక్ష వరకు వ్యూస్‌ సంపాదించింది.వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఓ కోతి దొంగతనంగా రైల్వే స్టేషన్‌లోని ఎంక్వయిరీ కౌంటర్ రూమ్‌లోకి ప్రవేశించడం గమనించవచ్చు.తర్వాత అది తనకు ఏదో కంప్యూటర్ స్కిల్స్ ఉన్నట్లు దాని ముందు కూర్చుని చాలా సీరియస్‌గా కీ బోర్డు నొక్కడం స్టార్ట్ చేసింది.

అక్కడే ఉన్నవారు ఈ కోతి చేష్టలను వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.

ఈ వీడియో చూసిన వారు “రైల్వేలో ఈ కోతిని కొత్త ఉద్యోగిగా నియమించినట్లు ఉన్నారు” అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.వామ్మో మొన్నటిదాకా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్( Artificial Intelligence ) మాత్రమే ఉద్యోగులకు పోటీ అనుకుంటే ఇప్పుడు కోతులు కూడా ఆ లిస్టులో జాయిన్ అయిపోయాయా? అని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానించారు.ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube