వైరల్ వీడియో: రైల్వే ఉద్యోగి అవతారం ఎత్తిన కోతి.. ఏం చేసిందంటే..
TeluguStop.com
కోతులను( Monkey ) మనుషుల తర్వాత అత్యంత తెలివైన వాటిగా పరిగణిస్తారు.
ఇవి చాలా వరకు మనుషులు లాగానే ప్రవర్తిస్తాయి.అలాగే తెలివిగా నడుచుకుంటాయి.
వీటి స్మార్ట్‌నెస్ ను చూపించే వీడియోలు ఇప్పటికే చాలా వైరల్ అయ్యాయి.తాజాగా ఆ కోవకు చెందిన మరో వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై చాలా మందిని ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో ఓ కోతి కంప్యూటర్ ముందు కూర్చొని ఒక డెడికేటెడ్ ఎంప్లాయ్ లాగా పని చేస్తూ ఉండడం చూడవచ్చు.
ఈ కోతి కంప్యూటర్ ముందు మనిషిలాగా కూర్చుని కీబోర్డ్( Keyboard ) పై టైప్ చేయడం చూసి చాలామంది నెటిజన్లు నవ్వుకుంటున్నారు.
"""/" /
@the_heavy_locopilot అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంటు తాజాగా పంచుకున్న ఈ వీడియో లక్ష వరకు వ్యూస్ సంపాదించింది.
వైరల్ వీడియో ఓపెన్ చేస్తే మనకు ఓ కోతి దొంగతనంగా రైల్వే స్టేషన్‌లోని ఎంక్వయిరీ కౌంటర్ రూమ్‌లోకి ప్రవేశించడం గమనించవచ్చు.
తర్వాత అది తనకు ఏదో కంప్యూటర్ స్కిల్స్ ఉన్నట్లు దాని ముందు కూర్చుని చాలా సీరియస్‌గా కీ బోర్డు నొక్కడం స్టార్ట్ చేసింది.
అక్కడే ఉన్నవారు ఈ కోతి చేష్టలను వీడియో తీయగా అది కాస్త సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.
"""/" /
ఈ వీడియో చూసిన వారు "రైల్వేలో ఈ కోతిని కొత్త ఉద్యోగిగా నియమించినట్లు ఉన్నారు" అని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
వామ్మో మొన్నటిదాకా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్( Artificial Intelligence ) మాత్రమే ఉద్యోగులకు పోటీ అనుకుంటే ఇప్పుడు కోతులు కూడా ఆ లిస్టులో జాయిన్ అయిపోయాయా? అని ఇంకొందరు సరదాగా వ్యాఖ్యానించారు.
ఈ ఫన్నీ వీడియోను మీరు కూడా చూసేయండి.
అతడితో నా అనుబంధానికి పేరు పెట్టలేను.. సమంత సంచలన వ్యాఖ్యలు వైరల్!