వైరల్: కాలువలో పడిపోయిన ఏనుగుకు CPR చేసి మరీ రక్షించిన రెస్క్యూ టీం… నెటిజన్ల ప్రశంసలు!

సోషల్ మీడియా ప్రభావం బాగా ప్రబలిన తరువాత అనేక రకాల వీడియోలు ఇక్కడ దర్శనం ఇస్తున్నాయి.అయితే అందులో ఏ కొన్నో జనాల హృదయాలను తాకుతూ ఉంటాయి.

 Viral The Rescue Team Who Did Cpr To The Elephant That Fell In The Canal And Sa-TeluguStop.com

అలా జనాల్ని మెచ్చిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి జనాలను తెగ మెప్పిస్తోంది.

విషయం ఏమంటే, సరిగ్గా ఏడాది వయసున్న ఓ ఏనుగు పిల్ల కాలువలో పడిపోవడంతో దానిని ఎలా రక్షించాలో తెలియక తాను కూడా కాలువలోకి దిగింది తల్లి ఏనుగు.అంతే ఇక, ఇద్దరికీ బయటకు వచ్చే మార్గం కనిపించలేదు.

అయితే ఆ హృదయవిదారక దృశ్యాన్ని చూసిన పశువైద్యులు, వాలంటీర్ల బృందం తల్లి ఏనుగును(elephant) పైకి తీసుకువచ్చేందుకు నానా తంటాలు పడ్డారు.ఈ క్రమంలో ఓ భారీ క్రేన్‌ను ఉపయోగించారు.తరువాత చాలా గంటలు శ్రమించాక ఎట్టకేలకు ఏనుగును పైకి తీసుకువచ్చారు.అంత కష్టపడినా ఆ ఒత్తిడికి ఏనుగు స్పృహతప్పి పడిపోయింది.దాంతో రెస్క్యూ బృందం ఏనుగు పైకి ఎక్కి CPR (కార్డియోపల్మోనరీ రెససిటేషన్) ఇవ్వడం ప్రారంభించారు.అయితే కాసేపటికి వారి కష్టం వృధా కాలేదు.

అవును, వారి ప్రయత్నం ఆఖరికి ఫలించింది.చివరకు ఏనుగు గమ్మున లేచి కూర్చుంది.ఈ క్రమంలో బురదలో కూరుకుపోయిన పిల్ల ఏనుగు(baby elephant) కూడా క్షేమంగా బయటకు వచ్చి తల్లి దగ్గరకు చేరింది.బిడ్డ స్పర్శ తగలగానే తల్లికి ప్రాణం లేచి వచ్చినట్టైంది.

ఏనుగును బయటకు తీయడమే కాకుండా, మానవులకు ఉపయోగించే పద్ధతి కంటే భిన్నమైన పద్ధతిని ఉపయోగించి CPR ఇవ్వడం ద్వారా ఏనుగును సదరు టీమ్ బతికించడంతో స్థానికులతో పాటు నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి రెస్క్యూ టీంను నెటిజన్లు కూడా ఆకాశానికెత్తేయడం మనం ఇక్కడ కామెంట్ల రూపంలో గమనించవచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube