సోషల్ మీడియాలో ఎన్ని వీడియోలు వైరల్ అయినా కొన్ని మాత్రం చాలా ప్రత్యేకంగా నిలిచిపోతాయి.అలాంటి వీడియోలు చూసినపుడు మనకి కూడా చాలా ఎమోషనల్ గా అనిపించకమానదు.
తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెటిజన్లను కంటతడి పెట్టిస్తోంది.వారిది చాలా ఏళ్లుగా పెనవేసుకున్న బంధం.
విధుల నిర్వహణలో ఓ ఏనుగు పోలీసులతో కలిపి ఎన్నో సాహసాలు చేసి అందరి ప్రసంశలు పొందింది.తాజాగా దానికి రిటైర్‌మెంట్ వయసు రావడంతో పోలీసులు బరువెక్కిన హృదయాలతో దానికి వీడుకోలు పలికారు.
అవును, తమిళనాడులోని ఓ ఏనుగు పదవీవిరమణకు అక్కడి అటవీ అధికారులకు సంబంధించిన సంఘటన ఇది.అవును, తమిళనాడులో ఓ కుమ్కీ ఏనుగు 60 ఏళ్ల వయసులో మార్చి 7న పదవీ విరమణ పొందింది.ఇక్కడ కుమ్కీ ఏనుగు అంటే, గాయపడిన లేదా ఇతర ప్రమాదాల్లో చిక్కుకున్న ఏనుగులను రక్షించేందుకు ప్రత్యేకంగా శిక్షణ పొందిన ఏనుగులను కుమ్కీ ఏనుగులు అని అంటారు.వీటిని వివిధ రెస్క్యూ ఆపరేషన్లలో భాగంగా అటవీ అధికారులు వినియోగిస్తారు.
ఆ రాష్ట్రంలోని కోజియాముట్టి ఏనుగు శిబిరానికి చెందిన ‘కలీమ్’ అనే కుమ్కీ ఏనుగు పదవీ విరమణ సందర్భంగా అటవీ అధికారులు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) చేయడం స్థానికంగా సంచలనం సృష్టించింది.
ఈ కలీమ్ దాదాపు 99 రెస్క్యూ ఆపరేషన్‌లలో పాల్గొందని ఆ అధికారులు తెలిపారు.ఈ సందర్భంగా తమిళనాడు ప్రభుత్వం అటవీశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి సుప్రియా సాహు ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియలో పోస్టు చేయగా అది కాస్త వెలుగు చూసింది.కలీమ్ పదవీ విరమణ చేస్తుంటే మా కళ్లు చెమ్మగిల్లాయి….
మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయని! సుప్రియా సాహు తన పోస్టులో రాసుకు రావడం విశేషం.అంతేకాకుండా వీడియో తిలకిస్తున్న నెటిజన్లు కూడా కన్నీరుని కార్చడం కామెంట్ల రూపంలో చూడవచ్చు.