గత కొన్ని రోజులుగా కవిత చుట్టూ ఢిల్లీ లిక్కర్ కేసు తిరుగుతుంది.ఇప్పటికే ఈ కేసులో చాలామందిని విచారించిన ఈడి కొంతమంది అరెస్ట్ కూడా చేసింది .ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు కూడా ప్రధానంగా ప్రస్తావించిన ఈడి మరొక పక్క kcr తనయ కవితను కూడా ఈ కేసులో బాగస్వామిని చేస్తుంది.ఇప్పటికే ఒక దఫా విచారణను పూర్తి చేసిన ఈడి మరొకసారి విచారణకు రావలసిందిగా కవితకు నోటీసులు జారీ చేసింది .రాజకీయాల్లో కక్ష తీర్చుకోవడానికి లేదా లొంగదీసుకోవడానికి మాత్రమే ఈ డి ఎలాంటి నోటీసులు ఇస్తుందని ఇదంతా కేంద్ర ప్రభుత్వ కనుసన్నలలో జరుగుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.ఇప్పటి వరకు ఐదు వేల చార్జిషీట్లు వేసిన ఈడి ఒక్క కేసును కూడా నిరూపించలేకపోయిందని, దీనిని బట్టి కేంద్రప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఏ స్థాయిలో దుర్వినియోగం చేస్తుందో అర్థం చేసుకోవాలని ఆయన తెలిపారు.
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన దర్యాప్తు సంస్థల్ని ఇలాంటి అనైతిక కార్యకలాపాల కోసం అక్రమాల కోసం దిగజార్చిన ఘనత మోడీ ప్రభుత్వానికి చెందుతుందని ఆయన ఆరోపించారు…… ఇటుపక్క రామచంద్ర పిళ్లై కవిత బినామీ అని, ఆ విషయాన్ని ఆయనే స్టేట్మెంట్ ఇచ్చారని ఈడి ప్రకటించింది.

దీనికోసం కోటి రూపాయలు ముడుపులు చేతులు మారాయని పక్క ఆధారాలు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి మరి నిజంగా ఈ కేసుతో కవితకు ఎంత సంబంధం ఉందో పక్కన పెడితే .రాజకీయ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడం కోసం ఈడిని కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందన్న ఆరోపణలు ఈ మధ్య ఎక్కువగా కేంద్ర ప్రభుత్వం పై వస్తున్నాయి .తమ పార్టీలో చేరిన వారిపై విచారణలో వేగం తగ్గిపోవడo , వారికి కేసుల్లో విముక్తి కలగడo ఇలాంటి పరిణామాలు చూస్తున్నప్పుడు .

ఈ ఆరోపణల్లో ఎంతో కొంత నిజం ఉందని అనిపిస్తుంది .మరి తమకు కొరకరానికి కొయ్యగా మారినా కేజ్రీవాల్ మరియు కేసీఆర్ ఇద్దరిపై ఒకే దెబ్బకు ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుందని, ఒక దెబ్బ ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఇద్దరినీ ఈ కేసులో ఇరికించి ముడిపెట్టిన ఈడీ చర్యలు చూస్తుంటే ప్రతిపక్షాల విమర్శలకు కొంత బలం చేకూరుతుంది ఏది ఏమైనా ఈ కేసుల్లోంచి బయటపడి రాజకీయంగా పై చేయి సాధిస్తారా? లేక మోడీ ముందు సాగిలపడతారా?అసలు ఈ కేసుల్లో నిష్పక్షపాతం ఎంత అన్నది రానున్న కాలంలో తెలుస్తుంది.







