వైరల్: పిల్లిని కొట్టి, ఏమి ఎరగనట్టు ఏడుస్తున్న బుడ్డోడు.. బిత్తరబోయిన పిల్లి పిల్ల!

నేడు సోషల్ మీడియా పరిధి విస్తరిస్తున్న వేళ రోజుకి ఎన్నో వీడియోలు అప్ లోడ్ అవుతూ వున్నాయి.అందులో ప్రత్యేకించి జంతువుల వీడియోలు త్వరగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

 Viral  The Kid Who Hit The Cat And Cried Like Nothing , Cat , Boy, Playing, Vira-TeluguStop.com

ఫన్నీ జంతువుల వీడియోలను ప్రజలచేత అత్యధికంగా వీక్షించబడుతున్నాయి.అలాగే పిల్లల వీడియోలు కూడా అనేకమంది ఇష్టంగా చూస్తున్నారు.

అయితే పిల్లలు, జంతువుల కలయిక కలిగిన వీడియోలు మరింత ఎక్కువ ప్రాచుర్యం పొందుతున్నాయి.తాజాగా అలాంటి ఘటనకు సంబంధించిన ఓ వీడియో చూపరులను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది.

వైరల్‌ అవుతున్న వీడియోలో ఏముందో ఒక్కసారి పరిశీలిస్తే, అందులో ఓ పసిపిల్లవాడు, ఓ పిల్లి పిల్ల స్పష్టంగా కనబడుతున్నాయి.ఇంతలో ఏమయ్యిందో తెలియదు గాని, ఆ పిల్లి వైపు వాడు గుర్రుగా చూస్తూ.

ఆడుకున్నట్టు నటిస్తూనే ఆ పిల్లి మూతిమీద ఒక్కసారిగా కొడతాడు.దానికి పిల్లి పెద్దగా రియాక్ట్ అవ్వదు కానీ, ఒక్క క్షణం ఆగి వాడే బోరున ఏడ్చేశాడు.

పాపం ఆ పిల్లికి దాంతో ఏం అర్థకాలేదనుకుంటా.బిత్తరపోయింది.

మాటలు రాని పిల్లికే కాదు, పిల్లాడు ఎందుకు ఏడుస్తున్నాడో చూసిన నెటిజన్లకీ అర్థం కావడం లేదు.మీకు అర్ధమైతే ఒకసారి చూసి చెప్పండి.

అయితే ఆ సమయంలో పిల్లి ముఖం చూడాలి! నవ్వకుండా ఉండలేరు.నన్నే కొట్టి నువ్వేందుకు ఏడుస్తున్నావ్‌ నాయనా అన్నట్టుగా ముఖం పెట్టింది ఆ పిచ్చి పిల్లి పిల్ల.

కేవలం ఎనిమిది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది.యోగ్ అనే అతను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పటివరకు 60,000 వీక్షణలు పొందింది.

అలాగే 2000కు పైగా లైక్ చేసారు.ఇక కామెంట్లకైతే లెక్కేలేదు.

ఒకసారి తిలకించి మీరు కూడా దానిపైన అభిప్రాయాన్ని చెప్పండి మరి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube