వైరల్: గోమాత, సర్పం మధ్య ప్రేమ ఒకసారి చూడండి... రెండు కళ్ళు చాలవు!

సాధారణంగా రెండు విరుద్ధ జంతువులు అనుకోకుండా తారస పడినపుడు ఇంచుమించుగా పోట్లాడుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాయి.లేదంటే చూసి చూడనట్టు తప్పుకోవడమో చేస్తాయి.

ఎందుకంటే అదే ప్రకృతి ధర్మం కాబట్టి.కానీ ఇక్కడ అలా ఇలా కాకుండా ప్రకృతికే విరుద్ధంగా ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది.

ఇక సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చాక ఇలాంటి వింత వింత విషయాలన్నీ వెలుగులోకి వస్తున్నాయి.ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి( Indian Forest Service Officer ) అయినటువంటి సుశాంత నంద సదరు వీడియోని పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్‌ అవుతోంది.ఆ వీడియోని గమనిస్తే ఓ పాము, ఆవు ఎంత సన్నిహితంగా ఉన్నాయో అర్ధం అవుతుంది.కాదుకాదు మొదట ఆ దృశ్యాన్ని చూస్తే మనకు చాలా ఆశ్చర్యం వేయక మానదు.

Advertisement

ఆ రెండు ఇక్కడ పరస్పరం చాలా అన్యోన్యంగా ఒకదానికొకటి ముద్దు పెట్టుకుంటూ ప్రేమగా ఉండడం మనం స్పష్టంగా చూడవచ్చు.పైగా ఏ మాత్రం దాడి చేసుకోకుండా చాలా సఖ్యంగా ఉంటాయి.

మొదట ఆ వీడియోని చూసినపుడు ఆ పాము ఎక్కడ ఆవుపై దాడి చేస్తుందో అని మనకు లోలోపల కంగారు మొదలవుతుంది.కానీ ఆ పాము మనం ఊహించినట్టు ఆ ఆవుకి ఎలాంటి హాని తలపెట్టదు.పైగా ఆవుతో సరదాగా ఉంటుంది ఆ పాము.

ఆ వీడియోని సుశాంత నంద ( Sushantha Nanda )ట్విట్టర్‌లో పోస్ట్‌ చేస్తూ "దీన్ని వివరించడం చాలా కష్టం, ఆ రెండింటి మధ్య చాలా స్వచ్ఛమైన ప్రేమ ఉంది కాబోలు!" అని క్యాప్షన్ కూడా ఇచ్చాడు.కాగా ఈ వీడియోకి లక్షల్లో వ్యూస్, లైక్‌లు రావడం కొసమెరుపు.

మరెందుకాలస్యం మీరు కూడా ఓ లుక్కేసి మీమీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి.

కారు బానెట్‌పై చిన్నారి కూర్చోబెట్టి రోడ్డుపై ఏకంగా..? (వీడియో)
Advertisement

తాజా వార్తలు