వైరల్: ఇలాంటి స్ట్రాబెరీ బిర్యాని ని ట్రై చేశారా మీరు..?!

సోషల్ మీడియా పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ మూలన ఏమి జరిగినా కానీ.అందరికీ ఇచ్చే న్యూస్ క్షణాలలో తెలిసిపోతుంది.

 Strawberry Biryani Viral In Social Media, Strawberry Biryani, Social Media, Neti-TeluguStop.com

ఆ న్యూస్ ఏదైనా సరే.అందరూ దాని వైరల్ గా మారుస్తూ వివిధ రకాలైన కామెంట్స్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.తాజాగా చికెన్ బర్గర్ తో ఐస్ క్రీం గురించి విని అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతే.ఈ తరుణంలోనే స్ట్రాబెరీ బిర్యానీ అంటూ మరో వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో నిలిచింది.

సాధారణంగా బిర్యానీ అంటే అందరూ లొట్టలు వేసుకుంటూ మరి భుజిస్తారు.కానీ, మామూలు బిర్యానీ అయితే బాగుండేది.

కానీ, ఇది స్ట్రాబెర్రీలు వేసి తయారుచేసిన బిర్యాని.

వాస్తవానికి ఇలాంటి కాంబినేషన్ ఉంటుందా.? అని మరికొందరిలో సందేహం రావడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.కానీ ఒక వ్యక్తి సోషల్ మీడియా వేదికగా తాను తయారు చేసిన స్ట్రాబెరీ బిర్యానీ ఫోటోలు పోస్ట్ చేస్తూ “ఈరోజు మేము మా ఇంట్లో స్ట్రాబెరీ బిర్యానీ తయారు చేశాం” అంటూ తెలిపాడు.

అంతేకాకుండా, మీ అభిప్రాయాలను తెలియజేయాలి అంటూ కోరాడు.ఇంకేముంది అనుకున్న విధంగానే నెటిజెన్స్ వారికి నచ్చిన విధంగా కామెంట్ చేస్తున్నారు.వాస్తవానికి ఈ కాంబినేషన్ అసలు ఉంటుందా అని కామెంట్స్ పెడుతూ ఉంటే.మరొకరు బిర్యానీలో బంగాళాదుంపలకు బదులు స్ట్రాబెరీలను ఉపయోగించరా లేదా అలంకరణ కోసం చేశారా అని కామెంట్ చేశాడు.

ఇలా ఎవరికి నచ్చినట్టు వారు కామెంట్స్ పెడుతున్నారు.

ఇదిలా ఉండగా ఆహార ప్రియులకు ముఖ్యంగా బిర్యానీ అంటే చాలా ఇష్టం.

ఇంతకు ముందు ఇలాచీ బిర్యానీ ఇంకా రకరకాల వంటివి కడుపులో ఏదో విధంగా అనిపించినా.మరి ప్రస్తుత ఈ స్ట్రాబెరీ బిర్యాని ఎలా ఉంటుందో మరి.ఇలా తీపి, కారం కలిపి చేసిన కాంబినేషన్ లో బిర్యానీ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి ఆహార ప్రియులకు అంతు పట్టడం లేదు.ఏది ఏమైనా సరే మీరు ఎప్పుడైనా ఇలాంటి విభిన్నమైన వంటకం ట్రై చేశారా…?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube