సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి.మరి ముఖ్యంగా జంతువులకు సంబందించిన వీడియోలు గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
నెటిజన్స్ కూడా జంతువులకు సంబందించిన వీడియోలను బాగా లైక్ చేస్తున్నారు.ఈ క్రమంలోనే ఒక ఏనుగుకు సంబందించిన వీడియోను నెటిజన్స్ బాగా ఇష్టపడుతున్నారు.
మూగ జీవులను హింసించడం, వాటిని చంపడం చట్టరీత్యా నేరం.అయినాగాని కొన్ని కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు నోరులేని మూగజీవల ప్రాణాలను బలిగొన్న సంఘటనల గురించి మనం వినే ఉంటాము.
అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఒక ముగ జీవి ప్రాణాన్ని ఇద్దరు వ్యక్తులు ఎంతో చాకిచక్యంగా కాపాడి అందరి దృష్టిలో హీరోలు అయ్యారు.
రైలు ఎంత వేగంగా ప్రయాణిస్తుందో మన అందరికి బాగా తెలిసిన విషయమే.
ఎదురుగా ఎలాంటి వాళ్ళు వచ్చినాగాని ఆగవలిసిన స్టేషన్లో తప్పా మరెక్కడా ఆగదు.పట్టాలపై మనుషులు, గేదెలు, గొర్రెలు వేరే ఇతర జంతువులు వచ్చినగాని రైలు మాత్రం తన గమ్యం చేరేవరకు ఆగదు.
ఇదిలా ఉండగా వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నటుండి ఒక ఏనుగు పట్టాలపైకి వచ్చి అటు నుంచి ఇటు దాటడానికి ప్రయత్నం చేస్తుంది.అదే సమయంలో ఎదురుగా పట్టాలపై ఒక రైలు వేగంగా ముందుకు దూసుకుని వస్తుంది.
అయితే ఆ పట్టాలపై ఉన్న ఏనుగును లోకో పైలెట్ చూశాడు.రైలు దగ్గరకు వస్తున్నగాని ఆ ఏనుగు రైల్వే ట్రాకును దాటలేదు.
వెంటనే అప్రమత్తమైన లోకో పైలెట్లు ఆర్ ఆర్ కుమార్, ఎస్ కుందుల సకాలంలో స్పందించి అత్యవసర బ్రేకులు వేయడంతో రైలు ఏనుగుకు కొద్ది దూరంలోనే ఆగిపోయింది.

ఈ ఘటనలో ఏనుగుకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.ఆ ఏనుగు సురక్షితంగా పట్టాలను దాటి చెట్లలోకి వెళ్లిపోయింది.ఈ ఘటన ఉత్తర బెంగాల్లో చోటుచేసుకుంది.
ఈ వీడియోను ఉత్తర బెంగాల్ కు చెందిన డివిజినల్ రైల్వే మేనేజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు.బుధవారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో గుల్మా సివోక్ మధ్య 23/1వద్ద రైల్వే ట్రాక్ ను దాటుతున్న ఏనుగు ప్రాణాలను కాపాడడం కోసం రైలు వేగాన్ని నియంత్రించడానికి బ్రేకులు వేసి.
ఆ ఏనుగును రక్షించాం అని క్యాప్షన్ కూడా పెట్టారు.ఈ వీడియోను చూసిన నెటిజన్లు అందరు ఆ ఇద్దరు లోకో పైలెట్లను పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.







