వైరల్: పద్యాలు చెప్పండి.. పెట్రోలు ఫ్రీగా పట్టండి..!

కొంతమందికి వారి మాతృభాషపై దీంతో అపురూపమైన ప్రేమ ఉంటుందని తెలిసిందే.

అయితే ఆ ప్రేమ కేవలం వారితో ఉంచుకోకుండా నలుగురికి పంచు విధంగా అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

ఇదిలా ఉండగా రోజురోజుకి పెట్రోల్ ధరలు మండిపోతున్నాయని మనం రోజూ చూస్తూనే ఉన్నాం.అయితే తాజాగా తమిళనాడు రాష్ట్రంలోని కరూరు నాగంపల్లి లో ఉన్న ఓ పెట్రోల్ పంపు ఉంది.

ఆ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ కస్టమర్లకు లీటర్ పెట్రోల్ ఉచితంగా అందిస్తున్నారు.అయితే ఇందుకు ఓ చిన్న షరతు ఉంది.

అదేమిటంటే.వారి పెట్రోల్ బ్యాంకు కు వచ్చే కస్టమర్ల పిల్లలు కనీసం 10 నుండి 20 పదాలు చెప్పే విధంగా ఉండాలి.

Advertisement

మన తెలుగు భాషలో వేమన శతకం ఎలాగో తమిళ భాషలో తిరువళ్ళువర్ రాసిన తిరుక్కురల్ పద్యాలు ఉంటాయి.ఈ పద్యాలు కేవలం రెండు పాదాలలో ఉంటాయి.

ఈ పద్యాలలో ఎన్నో జీవిత సత్యాలు ఉంటాయని అందుకే వాటిని పిల్లలు నేర్పించడానికి ఈ ప్రయత్నం అని ఆ పెట్రోల్ బంక్ యజమాని చెబుతున్నాడు.ఆ పెట్రోల్ బంక్ యజమాని పేరు సెంగుట్టవన్.

ఈయన స్థానికంగా ఉండే ఓ కళాశాల చైర్మన్ కూడా.పిల్లలలో తమిళ భాషకు సంబంధించిన భావలు కాస్తయినా ఉండాలని ఆయన భావన.

అందుకే ఆయనకు వారి కస్టమర్ల పిల్లలు పది పద్యాలు చెబితే అర లీటర్, అలాగే 20 పద్యాలు చెబితే లీటర్ పెట్రోలు ఉచితంగా అందిస్తున్నాడు.అంతేకాకుండా ఆయన కళాశాలలో ఉన్న కొంతమంది విద్యార్థులు 1330 పద్యాలను ఒకేసారి చెప్పడంతో ఆ విద్యార్థులకు ఏకంగా మూడు సంవత్సరాల పాటు ఉచితంగా చదువుకునేందుకు స్కాలర్ షిప్ కూడా ఆయన అందిస్తున్నాడు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పోలియోతో రెండు కాళ్లు పడిపోయినా రోజుకు 16 గంటల పని.. వైతీశ్వరన్ సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

అయితే ఇక్కడ మరో విషయం కూడా ఉంది.స్కాలర్షిప్ అందుకొన్న విద్యార్థులు నెలలో కనీసం రెండు ఆదివారాలు ఖచ్చితంగా కాలేజీకి వచ్చి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు ఆ పద్యాలు నేర్పించాలి.ఇలా పదిహేను సంవత్సరాలలో ఏకంగా 150 మంది విద్యార్థులు పెట్రోల్ బంకులో పద్యాలు చెప్పగా.15 మంది విద్యార్థులు స్కాలర్షిప్ అందుకోగలిగారు.

Advertisement

తాజా వార్తలు