వైరల్: బ్రెయిన్ కు సర్జరీ చేపించుకుంటున్న సమయంలో ఆ రోగి ఏం చేసిందంటే..?!

వైద్యరంగం బాగా అభివృద్ధి చెందింది అనడంలో ఈ ఆపరేషన్ ఒక ఉదాహరణ అని చెప్పడం అతిశయోక్తి లేదనే చెప్పాలి.

దేవుడి తరువాత మళ్ళీ దేవుడిలాగా చూసే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే అది ఒక్క వైద్యుడే అని చెప్పాలి.

పక్క వాళ్ళ ప్రాణాలను కాపాడే శక్తి వైద్యుడి చేతిలోనే ఉంది కాబట్టి.ఇప్పుడు వైద్యులు గురించి ఎందుకు చెబుతున్నాము అనుకుంటున్నారా.

ఎందుకంటే వైద్య రంగంలోనే ఒక అద్భుతం జరిగింది.డాక్టర్లు ఎంతో కష్టపడి ఒక నిండు ప్రాణాన్ని కాపాడారు.

మనకు ఏదైనా ఆపరేషన్ చేయాలంటే నొప్పి తెలియకుండా, సృహ లేకుండా ఉండడానికీ మత్తు మందు ఇచ్చి శస్త్రచికిత్స చేస్తారు కదా.కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే. మెలకువగా ఉన్న ఓ మహిళకు డాక్టర్లు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ చేశారు.

Advertisement

దీనికి సంబందించిన విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇటీవల బ్రెయిన్‌ లో కణతితో బాధపడుతున్న ఓ 24 ఏళ్ల మహిళకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలోని వైద్యులు బ్రెయిన్ సర్జరీ చేశారు.

సర్జరీ చేసి మెదడులోని కణతిని తొలగిస్తున్న క్రమంలో ఆమె మెలుకువగానే ఉండి హనుమాన్ చాలీసా పారాయణ చేశారు.చాలీసా చదివే క్రమంలో అందులోని పదాలను తప్పు పలకడంతో ఆపరేషన్ చేస్తున్న వైద్యుడు ఒకరు ఆమెకు సహకరించి ఆ లైన్ సరిచేసాడు కూడా.

కేవలం ఆ యువతికి కణతి ఉన్న ప్రాంతంలో మాత్రమే మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసినట్టు వైద్యులు తెలిపారు.ఇక ఈ విధానాన్ని వైద్య పరిభాషలో `క్రేనియోటమీ` అంటారని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.

ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే.ఆపరేషన్ అనంతరం ఆ మహిళ అసలు తనకు ఏమీ జరగలేదు అన్నట్టు ఆపరేషన్ థియేటర్ నుంచి తల అటూ ఇటూ ఊపుతూ బయటకోచ్చేసింది.అయితే ఈ సన్నివేశాలను అక్కడ ఆపరేషన్ చేస్తున్న వైద్య సిబ్బందిలో ఒకరు ఫోన్‌ లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఈ విడియో వైరల్ అయింది.అయితే ఈ ఆపరేషన్ అనంతరం ఎయిమ్స్ న్యూరో సర్జరీ విభాగం వైద్యుడు డాక్టర్ దీపక్ గుప్తా మీడియాతో మాట్లాడుతూ.24 ఏళ్లున్న మహిళకు మెదడులో ఏర్పడిన కణతిని శస్త్రచికిత్స ద్వారా తొలగించామని., సుమారు 3 గంటల పాటు జరిగిన ఈ ఆపరేషన్‌ లో మహిళ మెలకువతోనే ఉందని ఆయన తెలిపారు.

అభిమన్యుడి మరణం శ్రీకృష్ణుడికి ముందే తెలుసా..?
వీడియో వైరల్ : శోభనం గదిలో ఆలియా, రణ్ వీర్.. ఇదే తొలిసారి అంటూ..

ఆమె తలపై గల మాడు భాగంలో మాత్రమే మత్తు తో పాటు నొప్పి నివారణ మందు ఇచ్చామన్నారు.ఇక ఈ ఆపరేషన్ సక్సెస్ అయిందని ప్రస్తుతం ఆ మహిళ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఉందని, శనివారం డిశ్చార్జ్ చేయనున్నట్టు ఎయిమ్స్ వైద్యులు విరించారు.

Advertisement

తాజా వార్తలు