అడవి జంతువులను దగ్గరి నుంచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి.అయితే అది కుదిరే పని కాదు కదా.
ముఖ్యంగా క్రూర జంతువులను మాత్రం అస్సలు దగ్గరి నుంచి చూడలేం.ఎందుకంటే వాటికి కోపం వస్తే ఇంకేమైనా ఉందా మన ప్రాణాలు గాల్లో కలిసినట్టే.
ఇందులో సింహం గురించి చెప్పాలంటే దాన్ని ఎంత దూరం నుంచి చూస్తే అంత మంచిది.ఏ మాత్రం తేడా వచ్చినా దానికి ఆహారం అయిపోవాల్సిందే.
కాగా అడవి జంతువులకు సంబంధించిన వీడియోలు అంటేనే నెట్టింట విపరీతంగా వైరల్ అవుతుంటాయి.ఎందుకంటే వాటికి ఉన్న క్రేజ్ అలాంటిది మరి.
మరి అడవిలో సఫారీ టూర్ అంటే ఇంకెంత మజా అనిపిస్తుందో కదా.ఎందుకంటే ఈ టూర్ లో జంతువులను చాలా దగ్గరి నుంచి చూడొచ్చు.అడవిలో ఫ్రీగా తిరుగుతన్న జంతువులను మనం నేరుగా గమనించవచ్చు.వాటి జీవన విధానాన్ని చూడటం అంటే అదో చెప్పలేని థ్రిల్.
అయితే దీన్ని సరదాగానే ఉంచాలి గానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు.క్రూర జంతువులను డిస్టర్బ్ చేస్తే ఒక్కోసారి ప్రమాణాల మీదకు వస్తుంది.
ఇలాంటి ప్రమాదకర వీడియోలను మనం ఇప్పటికే చాలా చూస్తున్నాం.ఇప్పుడు కూడా ఇలాంటిదో ఒకటి వైరల్ అవుతోంది.
ఇప్పుడు టాంజానియా దేశంలో ఉండేటటువంటి సెరెంగేటి నేషనల్ పార్క్ లో కొందరు ఈ టూర్‌కు బయలు దేరి వెల్లారు.అయితే వారంతా కూడా సింహం దగ్గరికి వెల్లి కామెడీ చేసేందుకు ప్రయత్నించారు.
ఏకంగా కిటికీ తెరిచి మరీ దాన్ని చేతితో ముట్టుకునేందుకు ప్రయత్నించారు మరి సింహం ఊరుకుఉంటుందా.ఒక్క సారిగా వెనక్కు తిరిగి కోపంతో గాండ్రిస్తూ దాడిచేసేందుకు ప్రయత్నించింది.వెంటనే వారు కిటికీ క్లోస్ చేసి దానికి దూరంగా వాహనాన్ని తీసుకెళ్లారు.కొంచెం ఆలస్యం అయినా దాని నోటికి వారు ఆహారం అయిపోయేవారు.
.