టీమిండియా టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా రెండవసారి పెళ్లి చేసుకున్న విషయం దాదాపు అందరికీ తెలిసిందే.తన భార్య నటాషా స్టాంకోవిచ్‌ను హార్దిక్ రెండోసారి వివాహం ఆడాడు.
ప్రేమికుల దినోత్సవం అనగా ఫిబ్రవరి 14 నాడు రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్ కోటలో వీరి పెళ్లి వేడుక కన్నులపండుగగా జరిగింది.కుటుంబ సభ్యులు, సన్నిహుతులతో పాటు కుమారుడు అగస్త్య సమక్షంలో హార్దిక్-నటాషా ఉంగరాలు మార్చుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది.
కాగా ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.ఈ సందర్భంగా పెళ్లి వేడుక అనంతరం హార్దిక్ పాండ్యా-నటాషా తమ సన్నిహితులకు గ్రాండ్‌గా పార్టీ ఇచ్చారు.
ఇక ఈ పార్టీలో హార్దిక్-నటాషా పీకల దాకా తాగి, ఈ ప్రపంచాన్ని మరిచి చిందులు వేశారు.ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.యాగా ఈ వేడుకలో నటాషా యువరాణిలా మెరిసింది.రెండేళ్ల క్రితమే హార్దిక్ పాండ్యా-నటాషాకు వివాహం జరగగా లాక్‌డౌన్ సమయంలో సహజీవనం చేసిన వీరి ఇద్దరికీ 2020 జూలైలో కుమారుడు అగస్త్య జన్మించాడు.
ఇక అప్పుడు వేడుకగా పెళ్లి చేసుకోలేకపోయామనే లోటు తీర్చేందుకు నటాషాకు మేరకు వాలంటైన్స్ డే గిఫ్ట్ ఇచ్చాడు హార్దిక్.
ఈ సందర్భంగా నటాషా కూడా తమ పెళ్లి వేడుకల తాలూక ఫొటోలు పంచుకుంటూ… సోషమీడియా వేదికగా తన సంతోషాన్ని వ్యక్తపరిచింది.మూడేళ్ల క్రితం చేసిన పెళ్లి ప్రమాణాలను మరోసారి గుర్తుచేసుకున్నామని.కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుక జరగడం సంతోషంగా ఉందంటూ… ఒక ట్వీట్ చేసింది.
కాగా ఈ పోస్టులు చూసిన నెటిజన్లు మాత్రం మిశ్రమంగా స్పందిస్తున్నారు.రెండోసారి పెళ్లి చేసుకొని హార్దిక్-నటాషా డబ్బులు వృథా చేశారని కొందరంటే… అలాంటి వృధా ఖర్చులు చేసేబదులు ఎవరికైనా సాయం చేసినా బాగుండేదని కొంతమంది నెటిజన్లు విమర్శిస్తున్నారు.