వైరల్: కరోనా తిప్పలు, చైనాలో ఓ జంట వింత ముసుగు... బతికేందుకు కుక్కపాట్లు?

చైనాలో పురుడు పోసిన కరోనా వైరస్ చైనాపైనే ప్రతాపాన్ని చూపిస్తోందా? అవునంటున్నారు కొంతమంది విశ్లేషకులు.BF-7 వేరియంట్ ఆ దేశంలోని ప్రధాన నగరాల్లో విజృంభిస్తోంది.కాగా మొన్నటి వరకు చాలా కట్టుదిట్టమైన లక్డౌన్ విధించగా… ప్రజలు తిరగబడటంతో దాదాపు 37 మిలియన్ల మంది ప్రజలు ఈ వారంలో అక్కడ కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో కొన్ని వందల మంది మృత్యువాత పడుతున్నారు.

 Viral Corona Tips A Couple In China Strange Mask Dogs To Survive-TeluguStop.com

దాంతో అక్కడ శవాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోతున్నాయి.

ఈ కారణంగా లాక్డౌన్ ఎత్తేయమని చెప్పిన అక్కడి ప్రజలు బయటకు రావాలంటే వణికిపోతున్నారు.

ఇక ఈ సందర్భంగా వినూత్న రీతిలో కరోనా నుంచి రక్షించుకునేందుకు చైనా దేశ ప్రజలు అనేక మార్గాలను అనుసరిస్తున్నారు.ఈ క్రమంలో ఓ జంట మార్కెట్‌లోకి వచ్చిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

దాంతో సదరు వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయి కూర్చుంది.విషయం ఏమంటే ఓ జంట కూరగాయలు కొనేందుకు స్థానిక మార్కెట్టుకి వచ్చారు.

అందరిలా వస్తే ఇక్కడ వాళ్ళ గురించి చెప్పుకొనేవాళ్ళం కాదు.వారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పెద్ద పథకమే వేశారు. ఓ ప్లాస్టిక్ కవర్ ని వారిద్దరూ కవర్ చేస్తూ పైన గొడుగుకి తగిలించారు.దాంతో ఆ కవర్ వారికి ఒక గదిలాగా ప్రొటెక్షన్ ఇస్తోంది.

అంటే ఓ పొడవాటి ప్లాస్టిక్ షీట్‌ను గొడుగువలే చేసుకున్నారు.వారు బయటకి రాకుండా కవర్లోనే ఉండి కావాల్సిన సరుకులను కొనుక్కోవడం ఇందులో గమనించవచ్చు.

కాగా ఈ జంట వినూత్న చర్యను చూసి నెటిజన్లు మాత్రమే కూండా స్థానికులు కూడా ఆశ్చర్యపోవడం ఇక్కడ గమనించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube