మనలో చాలామందికి ఎనలేని జంతు ప్రేమ ఉంటుంది.ముఖ్యంగా నేడు ప్రతి ఇండ్లలో ఓ కుక్కకి స్థానం ఉంటుంది.
కొందరు సరదాకోసమో లేదంటే కాపలాకోసమో పెంచుకుంటూ వుంటారు.ఈ క్రమంలో వాటితో ఎమోషనల్ గా కనెక్ట్ అవుతూ వుంటారు.
ఎందుకంటే అవి విశ్వాసానికి మారుపేరు గనుక.అయితే అలా పెంచుకున్న వాటిలో దాదాపు ఇతర జాతుల శునకాలు అయి ఉంటాయి తప్ప, దాదాపుగా ఎవ్వరూ దేశీయ కుక్కలను పెంచుకోవడానికి ఇష్టపడరు.
అయితే అతగాడు అలాంటివారందరికీ భిన్నం అని చెప్పుకోవాలి.అవును, క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని అతడు వీధికుక్కలకు పార్టీ ఇద్దామని డిసైడ్ అయ్యాడు.అదేంటి పండగ పూట ఎవరన్నా స్నేహితులతోనో కుటుంబ సభ్యులతోనో పార్టీ చేసుకుంటారు గాని ఈ శునకాల గోలేమిటని అనుకుంటున్నారా? అలా అతగాడు ఆలోచిస్తే మనకి అతనికి తేడా ఏమిటి? అవును, అతను మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంలాగా కనబడ్డాడు నేడు.
విషయంలోకి వెళితే, థాయిలాండ్ లోని నియాల్ హర్బిసన్ అనే వ్యక్తి క్రిస్మస్ సందర్భంగా వీధి కుక్కలకు విందు ఏర్పాటు చేసాడు.కాగా దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ నేను ఈ రోజు వీధి కుక్కల గుంపుకు మంచి భోజనాన్ని అందించాను అని టెక్స్ట్ జతచేసాడు.ఇందుకోసం అతను ఉదయం 4.30 గంటలకే లేచాడట.అతనే స్వయంగా ఆహారాన్ని తయారు చేసి మరీ వాటికి వడ్డించాడట.
అలా తాను స్వయంగా తయారు చేసిన ఆహారాన్ని ప్లేట్స్‌లో పెట్టి తన జీపుపై వాటిని వీధి కుక్కలు ఉండే ప్రాంతానికి తీసుకువెళ్లి, తారసపడిన వీధికుక్కకు ఆహారాన్ని అందించాడు.దాంతో హర్బిసన్ మంచి మనస్సుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.