సోషల్ మీడియాలో నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతూ వస్తాయి.ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఈ క్రమంలోనే ఇప్పుడు కూడా సీ లయన్ చేసిన చిలిపి పనికి సంబంధించిన వీడియోను నేటిజన్లు బాగా లైక్ చేస్తున్నారు.ఈ వీడియోలో సీ లయన్ చేసిన పని చూసి నేటిజన్స్ మాత్రం నవ్వకుండా అసలు ఉండలేరు.
ఒక్కోసారి జంతువులు చేసే పనులు చూస్తుంటే భలే నవ్వు వస్తుంది.అచ్చం జంతువులు కూడా మనుషుల మాదిరిగానే కొన్ని కొన్ని పనులు చేసి అందరిని ఆశ్చర్యపరుస్తాయి.
తాజాగా సీ లయన్ చేసిన ఒక పని కూడా నేటిజన్స్ కి నవ్వు తెప్పిస్తుంది.ఇంతకీ అసలు ఈ సీ లయన్ చేసిన పని ఏంటో తెలుసుకుందామా.
ఈక్వెడార్ లోని గాలాపగొస్ ఐలాండ్స్ లో ఉన్న ఒక బీచ్ సైడ్ దగ్గరలో ఒక అందమైన రిసార్ట్ ఉంది.రిసార్ట్ కు దగ్గరలో ఉన్న సముద్రంలోంచి ఒక సీ లయన్ మెల్లగా నడుచుకుంటూ డైరెక్ట్ గా రిసార్ట్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరకు వస్తుంది.
అక్కడితో ఆగకుండా వెంటనే ఆ స్విమ్మింగ్ పూల్ లో దూకేసి ఎంచక్కా ఈదుకుంటూ వెళ్లి స్విమ్మింగ్ పూల్ పక్కనే ఉన్న లాంజ్ చైర్ పైకి ఎక్కి రిలాక్స్ అవుతూ పడుకుంది.అయితే అప్పటికే ఆ లాంజ్ చైర్ పై ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు.
ఎప్పుడయితే స్విమ్మింగ్ ఫుల్ నుంచి సీ లయన్ తన చైర్ దగ్గరకు రావడం చూస్తాడో అప్పుడే ఆ వ్యక్తి ఆ చైర్ లో నుంచి వెంటనే లేచి పక్కకు వెళ్లిపోవడం మనం వీడియోలో చూడవచ్చు.ఆ వ్యక్తి వెళ్ళిపోయాక ఎంచక్కా సీ లయన్ ఆ చైర్ పై ఎక్కి పడుకుని రిలాక్స్ అవుతూ ఉంటుంది.
ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వీడియోను చూసి నెటిజన్లు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.








