సామాజిక మాధ్యమాల్లో వైరలయ్యే యానిమల్స్ వీడియోలు చాలా మందిని ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా ప్రమాదంలో ఉన్న జంతువులను రెస్క్యూ చేసే వీడియోలు అందరికీ ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి.
తాజాగా ఆ కోవకు చెందిన ఒక వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
నీటిలో పడి పోయిన ఒక జింక రాళ్ల మీదకు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించింది.అయితే ఆ రాళ్లు చాలా తడిగా, స్మూత్ గా ఉండటంతో అది పైకి ఎక్క లేకపోయింది.
అలా అది మళ్లీ నీటిలోనే పడిపోయి ఎలా బయటపడాలో తెలియక నానా తిప్పలు పడింది.నీటిలో ప్రమాదకరమైన జీవులు తనని చంపేస్తాయేమోనని ఆ జింక బాగా భయపడింది.
అయితే ఈ సమయంలోనే కొందరు చిన్న పడవ పై అటువైపుగా వచ్చారు.దాన్ని చూసి వారు చాలా జాలి పడ్డారు.
అనంతరం పెద్ద మనసు చేసుకొని దాన్ని కాపాడి తమ గొప్ప హృదయాన్ని చాటుకున్నారు.దీనికి సంబంధించిన వీడియోని వారిలోని ఒకరు వీడియో తీశారు.
ఇప్పుడు ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక తెప్ప కర్ర తోటి కొందరు వ్యక్తులు జింకని నీటిలోనుంచి రాళ్ల మీదకు ఎక్కించడానికి ప్రయత్నిస్తున్నట్టు చూడొచ్చు.
అయితే దాని ప్రయత్నం విఫలమయింది.దీంతో ఆది నీటిలో ఈదుకుంటూ వేరొక వైపు వచ్చింది.నీటి అలల తాకిడికి అది ఉక్కిరిబిక్కిరి అయ్యింది.అయితే సముద్రం లో సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చిన వారు దీనిని తమ చిన్న పడవ లోకి తీసుకున్నారు.
అనంతరం దాన్ని నది ఒడ్డుకు సురక్షితంగా చేర్చారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు జింకను కాపాడిన వ్యక్తులకు ధన్యవాదాలు చెబుతున్నారు.అయితే వీరు నదికి రాంగ్ సైడ్ జింక ను వదిలి పెట్టారా లేక తల్లి ఉన్న వైపే వదిలి పెట్టారా అనేది తెలియరాలేదు.దీంతో కొందరు జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డూడూ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోకి ఇప్పటికే లక్షకు పైగా లైక్స్, మిలియన్ల వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.







