వైరల్: కాలువలోంచి బయటపడుతున్న సైకిళ్లు... కారణం ఇదే!

సోషల్ మీడియా( Social media ) వచ్చాక విశ్వవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలను మనం చూస్తూ వున్నాము.తాజాగా అలాంటి సంఘటనకు సంబందించినటువంటి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం మనం గమనించవచ్చు.

 Viral: Bicycles Coming Out Of The Canal This Is The Reason, Viral News, Latest-TeluguStop.com

అక్కడ కాలువను శుభ్రం చేస్తుంటే వేలకొద్దీ సైకిళ్లు బయటపడుతున్నాయి.కుప్పలు తెప్పలుగా బయటపడుతున్న సైకిళ్లను చూసి స్థానికులు అవాక్కయైన పరిస్తితి.

ఇక ఈ వైరల్ వీడియోని చూసి నెటిజనం కూడా షాక్ అవుతున్నారు.

ఇక్కడ వీడియోని మనం గమనించితే ఓ జేసీబీ కాలువను శుభ్రం చేస్తుంటే వేలకొద్దీ సైకిళ్లు బయటపడుతున్నట్టుగా చాలా స్పస్టంగా కనిపిస్తోంది.విషయం ఏమిటంటే, నెదర్లాండ్ రాజధాని ఆమ్ స్టర్ డ్యామ్( Amsterdam ) అనే సంగతి అందరికీ విదితమే.ఈ నగరాన్ని ‘బైస్కిల్ కేపిటల్‘ అని ‘సైక్లింగ్ కేపిటల్ ఆఫ్ ది వరల్డ్’ అని పిలుస్తూ వుంటారు.

ఎందుకంటే ఆ నగరవాసులు ఎక్కువగా సైకిళ్లు వాడతారు.ఇక్కడి జనాభా కంటే సైకిళ్ల సంఖ్యే డబుల్ గా ఉంటుందని ఓ నానుడి.

అంతలా వారు సైకిళ్లకు ప్రాధాన్యత ఇస్తారు.పర్యావరణానికి హాని కలుగకుండా నగరవాసులు సైకిళ్లను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

కానీ అవే సైకిళ్లు( Bicycles ) ఆ నగరంలోని ఓ ఇబ్బందిగా మారాయని తాజా సర్వేలు చెబుతున్నాయి.ఆమ్ స్టర్ డ్యామ్ నగరంలోని 160పైనే కాలువలు ఉన్నాయి.నగర వాసులు ఏదైనా పనిమీద సైకిల్ పై వచ్చినప్పుడు సైకిళ్లను కాలువ పక్కన పార్క్ చేస్తుంటారు.ఇక అక్కడ తరచూ ఈదురుగాలులు వీస్తూ వుంటాయి.అలా గాలి వచ్చినప్పుడు సైకిళ్లు ఆ కాలువల్లో పడిపోతుంటాయి.అంతేకాకుండా కొంతమంది వాడేసిన సైకిళ్లను పాతవి అయిపోయాక వాటిని కాలువల్లో పారేస్తారని ఓ సర్వేలో తేలింది.

ఇక అక్కడ కాలువలు శుభ్రం చేసినప్పుడు భారీ సంఖ్యలో సైకిళ్లు బయటపడుతుంటాయట.అలా తాజాగా గత బుధవారం కాలువల్ని శుభ్రం చేస్తుంటే ఓ ప్రాంతంలో వేల సంఖ్యలో సైకిళ్లు బయటపడ్డాయి.

Many bicycles end up in the canals of Amsterdam

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube