వైరల్: పాట పాడుతున్న తిమింగలాలు.. తమ జోడి కోసమేనా..?!

పాటలు పాడే తిమింగలాలు ఉన్నాయంటే ఎవరైనా నమ్ముతారా.? చాన్సే లేదు, తిమింగలాలు పాటపాడటమేంటి అనుకుంటున్నారు కదా.

కానీ ఈ సృష్టిలో మనకు తెలియని ఎన్నో వింతలు విడ్డూరాలు చోటు చేసుకున్నాయి.సైన్స్‌ కు అందని ఎన్నో వింతలు ఈ భూభాగం మీద జరుగుతుంటాయి.

అయితే ఇప్పుడు మనం తిమింగలాల గురించి తెలుసుకుందాం.అన్నింటికంటే తిమింగలాలు అనేవి చాలా తెలివైనవని, అదే మాటను రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ మరోసారి నిర్దారించింది.

అదేలా అంటే.? తిమింగలాలు దాదాపు 8000 కిలోమీటర్ల మేర సముద్రంలో ప్రాంతంలో పాటల ద్వారా సహచరులతో కమ్యూనికేట్ అవుతాయంట.మేల్ హంప్ బ్యాక్ తిమింగలాలు తమ సంతానోత్పత్తి కాలంలో జాబ్ తరహా మేటింగ్ సాంగ్స్‌ను హమ్ చేస్తాయని తెలిపింది.

అది ఎలా అంటే.?!తూర్పు ఆస్ట్రేలియా తీరంలో హంప్ బ్యాక్ తిమింగలాలను నుంచి వినిపించిన పాటలను ఈక్వెడార్‌ కు చెందిన పరిశోధకుల బృందం రికార్డు చేసింది.ఈ మేరకు భూగోళం ఇప్పుడు తిమింగలాల కోసం ప్రత్యేక స్వరంతో అనుసంధానించబడి ఉంటుందని అధ్యయన రచయిత, సెయింట్ ఆండ్రూస్ యూనివర్సిటీలో సముద్ర జీవశాస్త్రవేత్త ఎల్లెన్ గార్లాండ్ వెల్లడించారు.

Advertisement

అయితే కాలక్రమేణ తిమింగలాలు పాడే పాటలు మారవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు.అయితే తిమింగలాలు ఒకానొక సమయంలో అన్నీ ఒకే పాటను ఆలాపిస్తాయంట. పొరుగున ఉన్న తిమింగలాలు, ఒకదానికి ఒకటి శబ్ద పరిధిలోకి వెళ్లినప్పుడు ఈ పాటలను పాడుతూ ప్రయాణిస్తాయని రచయిత తెలిపాడు.

అయితే తిమింగలాలు, సంతానోత్పత్తి ప్రదేశాలను విడిచిపెట్టి, ఆహార ప్రదేశాలకు వలస పోతున్నప్పుడు ఈ పాటలు పాడటం అనేది సర్వసాధారణంగా జరుగుతుందంట.అయితే దీనితో పాటు ఫిమేల్స్‌ తో సంభోగానికే, రెండు మేల్స్ మధ్య ఇంటరాక్షన్ కోసమా అనేది మాత్రం క్లారిటీ లేదంట.

Advertisement

తాజా వార్తలు