వైరల్: ఆనంద్ మహీంద్రాను మెచ్చిన మరో ఐడియా... క్షణాల్లో వందల ఇడ్లీలు రెడీ!

ఆనంద్ మహీంద్రా ( Anand Mahindra )గురించి అందరికీ తెల్సిందే.ఇక్కడ ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.

దేశీయ బడా వ్యాపారవేత్త అయినప్పటికీ, నిత్యం సోషల్ మీడియా ద్వారా సామాన్యులకి కూడా అందుబాటులో వుంటారు ఆనంద్ మహీంద్రా.ఇక ఇతనికి ఎలాంటి విషయం నచ్చినా, తన అభిమానులతో పంచుకోకుండా ఉండలేరు.

తాజాగా అలాంటి ఓ సంఘటన గురించి తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా పంచుకున్నారు.

Viral: Another Idea That Appreciated Anand Mahindra... Hundreds Of Idlis Are Rea

మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా యావత్ భారత దేశమంతటా వున్న టిఫిన్ షాపులలో మొదటగా ఉడికేది ఏది అంటే, మనకు గుర్తొచ్చేది ఇడ్లీనే( Idli ).ఇడ్లీని మనవాళ్ళు ఎంతో ఇష్టంగా తింటారు.అంతేకాకుండా ఇడ్లీ, పల్లీ చట్నీ అనేది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేకూరుస్తుంది.

Advertisement
Viral: Another Idea That Appreciated Anand Mahindra... Hundreds Of Idlis Are Rea

ఈ కారణంగానే డాక్టర్లు కూడా ఇదే టిఫిన్ తినమని సజెస్ట్ చేస్తూ వుంటారు.ఇడ్లీ మరియు పల్లీ చట్నీ అనేది డెడ్లీ కాంబినేషన్.

Viral: Another Idea That Appreciated Anand Mahindra... Hundreds Of Idlis Are Rea

ఇక అసలు విషయంలోకి వెళితే, ఓ వ్యక్తి కస్టమర్స్‌ కోసం ఇడ్లీలు వేస్తున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది.ఎంత వేగంగా వేస్తున్నాడంటే అతను కొన్ని నిమిషాల్లోనే వందల ఇడ్లీలు తయారు చేసి అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.ఓ పెద్ద ఇడ్లీ ప్లేట్లన్నీ ఓ బల్లమీద వరుసగా పేర్చి, దానిపైన ఆయిల్‌ స్ప్రే చేసిన తర్వాత ఓ పెద్ద పాత్రలో ఇడ్లీ పిండి తీసుకొని ఓ మగ్గుతో పిండిని ఇడ్లీప్లేట్లలో కుమ్మరించాడు.

అనంతరం ఒక మాప్‌లాంటిది తీసుకొని ఎక్‌స్ట్రా పిండిని ఎంతో చాకచక్యంగా తీసివేసాడు.ఇంకేముంది తరువాత వాటిని తీసుకెళ్లి స్టవ్‌పైన ఇడ్లీ స్టాండ్‌లో పెట్టిన తరువాత క్షణాల్లో ఇడ్లీ రెడీ అయ్యి బయటకి వచ్చేస్తున్నాయి.

అతను తయారు చేసిన ఇడ్లీలు కస్టమర్స్‌కే కాకుండా అక్కడికి వచ్చిన ఓ గోమాతకు కూడా ఎంతో ప్రేమగా పెడుతున్నాడు.ఈ విషయం మన ఆనంద్ మహీంద్రాకు నచ్చి పోస్ట్ చేసారు.

వైరల్ వీడియో.. అరె పిల్లలు అది డాన్స్ ఫ్లోర్ కాదరయ్యా.. క్రికెట్ మ్యాచ్!
Advertisement

తాజా వార్తలు