వైరల్: బూటులో తల దాచుకున్న పాము... కాలు పెట్టగానే బుసలు కొట్టింది!

సోషల్ మీడియా తీవ్రత పెరగడంతో అనేక రకాల వీడియోలు మన కంట పడుతున్నాయి.అందులో కొన్ని ఆశ్చర్యంగా ఉంటే, కొన్ని భయంకరంగా ఉంటాయి.

 Viral A Snake Hiding Its Head In A Shoe ,snake, Shoe, Viral Latest, News Viral,-TeluguStop.com

ఇంకొన్ని ఫన్నీగా ఉంటే… మరికొన్ని చాలా విచిత్రంగా అనిపిస్తాయి.ఇక తాజాగా ఓ భయానకమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ప్రమాదం అనేది ఎటువైపునుండి వస్తుందో ఎవ్వరికీ తెలియదు.ఇలాంటి సమయాల్లో ఉన్నట్టుండి ప్రాణాపాయం సంభవిస్తుంటుంది.

తాజాగా అలాంటి సంఘటన ఒకటి అవాక్కయేలా చేస్తోంది.

ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కర్నాటకలోని మైసూరులో చోటు చేసుకుంది.

ఇక వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే, ఓ వ్యక్తి ఇంటి నుంచి బయటికి వెళ్తూ షూ ధరించడానికి షూస్ దగ్గరకు వెళ్ళాడు.ముందూ వెనుకా గమనించకుండా షూలో కాలు పెట్టే ప్రయత్నం చేసాడు.

అయితే అతనికి ఇంకా భూమిమీద నూకలు ఉన్నట్టున్నాయి.అలా అందులో కాలు పెట్టీపెట్టగానే అందులో వున్న ప్రాణిని చూసి ఒక్కసారిగా వణికిపోయాడు.

అవును, అందులో వున్న పాము ఒక్కసారిగా బయటికి తలతీసి పడగ విప్పి బుసకొట్టింది.

దీంతో అతను హడలిపోతూ బయటికి పరుగులంకించాడు.వెంటనే స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇవ్వడంతో అక్కడికి వచ్చి.చాకచక్యంగా దాన్ని పట్టుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

కాగా దీనికి సంబందించినటువంటి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.ఇకపోతే ఇలా షూలలో విష సర్పాలు దాక్కోవడం గతంలో కూడా చాలా సార్లు మనం చూసాము.

ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో అన్నమాదిరిగా ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు.పైగా ఇది వర్షాకాలం కనుక మీరు వేసుకోవలసిన షూస్ బయట ఉన్నట్టయితే, ఒకసారి చెక్ చేసుకొని ధరించడం మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube