వైరల్: ఏకంగా 2 కిలో మీటర్లకు పైగా రోడ్డుపై ప్రేమ కవితలు రాసిన వ్యక్తి..!

ప్రేమ ఎప్పుడు ఎలా పుడుతుందో తెలీదు.కానీ ప్రేమ పుట్ట‌డం స‌హ‌జం.

ఆ ప్రేమ‌ను వ్య‌క్త‌ప‌రిచేందుకు ఒక్కొక్క‌రు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటుంటారు.

కొంద‌రు మోకాళ్ల పై కూర్చోని రోజా పువ్వుల‌తో త‌మ‌ ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తుండ‌గా.

మ‌రికొంద‌రు ప్రేమ‌లేఖ‌లు, సోష‌ల్ మీడియాలో త‌మ ప్రేమను తెలియ‌జేస్తుంటారు.ప్రేయసికి తన ప్రేమను చెప్పడానికి రకరకాల మార్గాలు అనుసరిస్తుంటారు యువకులు.

చాల మంది ప్రేమ కోసం ఎన్నో చేస్తారు.‘వావ్.

Advertisement

నేనంటే నీకు ఎంత ప్రేమ.!’’అని ప్రియురాలితో అనిపించుకోవటానికి ఆమెను ఇంప్రెస్ చేయటానికి ఎన్నెన్నో చేస్తాడు.

అటువంటి ఓ ప్రియుడు తన ప్రియురాలి కోసం ఏం చేశాడో తెలుసా.? అయితే.అంద‌రిలా చేస్తే ఏం మ‌జా ఉంటుంద‌ని అనుకున్నాడో.

వెరైటీగా చేయాల‌ని బావించాడో ఏమోగాని.ఓ యువ‌కుడు ఏకంగా రోడ్డుపైనే త‌న ప్రేమ‌ను తెలియ‌జేస్తూ.

ప్రేమ క‌విత‌లు రాసేసాడు.ఇలానే ఓ వింత పద్ధతిలో తన ప్రేయసికి ప్రేమ కవితలు రాశాడో మహారాష్ట్ర కుర్రాడు.ఇలా కొద్ది దూరం రాసాడో అనుకుంటే పప్పులో కాలేసిన‌ట్లే ఏకంగా 2.5 కిలోమీట‌ర్ల పొడ‌వునా రాశాడు.ఈ ఘ‌ట‌న మ‌హారాష్ట్ర‌లో జ‌రిగింది.

ప్రభాస్ తో సినిమా చేయడానికి సర్వం సిద్ధం చేస్తున్న బాలీవుడ్ డైరెక్టర్...
తొలి ప్రయత్నంలో ఫెయిల్.. రెండో ప్రయత్నంలో ఐఎఫ్ఎస్ ఫస్ట్ ర్యాంక్.. రిత్విక సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

పూర్తి వివరాల్లోకి వెళ్తే.మహారాష్ట్ర లోని కొల్హాపూర్ కుర్రాడు ఓ రహదారిపై ఏకంగా 2.5 కిలోమీటర్ల పొడవునా తన ప్రేమ పరిచాడు.తన గుండెలో ప్రేయసి అంటే ఎంత ప్రేమో రాసుకొచ్చాడు.రోడ్డుపై 2.5 కిలోమీటర్ల దూరం పాటు ప్రేమ కవితలు రాశాడు.వాటిలో ‘ఐ లవ్యూ’, ‘ఐ మిస్ యూ’ అంటూ తన హృదయాన్ని నడిరోడ్డు మీద గుమ్మరించాడు ఆ ప్రేమికుడు.

Advertisement

రోడ్డును తన ప్రేమతో నింపేశాడు.వీటిలో ఒక మెసేజిలో ‘మిస్ యూ.జిందగీ కే సాత్, జిందగీ కే బాద్ భీ’ అంటూ కవితలు అల్లాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియో ను చూడండి.

తాజా వార్తలు