డైరెక్టర్ మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో రూపొందిన సినిమా వినరో భాగ్యము విష్ణు కథ.ఇందులో కిరణ్ అబ్బవరం, కాశ్మీరీ పరదేశి, మురళీ శర్మ, పమ్మి సాయి, రవి ప్రకాష్, ప్రవీణ్ తదితరులు నటించారు.
ఇక ఈ సినిమాకు బన్నీ వాస్ తీర్మాతగా బాధ్యతలు చేపట్టాడు.చైతన్ భరద్వాజ్ సంగీతం అందించాడు.
ఇక ఈరోజు ఈ సినిమా థియేటర్లో విడుదల అయ్యింది.ఇక కిరణ్ అబ్బవరం గత కొంతకాలం నుంచి వరుసగా ప్లాప్స్ అందుకుంటూనే ఉన్నాడు.
దీంతో మంచి సక్సెస్ కోసం ఈయన ఇప్పుడు ఎదురు చూస్తున్నాడు.మరి ఈ సినిమా ఆయనకు ఎటువంటి సక్సెస్ అందించిందో ఇప్పుడు చూద్దాం.

కథ:
కథ విషయానికి వస్తే.ఇందులో కిరణ్ అబ్బవరం విష్ణు అనే పాత్రలో కనిపిస్తాడు.చిన్నప్పుడే తల్లితండ్రులను పోగొట్టుకున్న విష్ణు తన తాత దగ్గర పెరుగుతాడు.ఇక నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న సామెతను పట్టుకొని విష్ణు అందరికీ సహాయం చేస్తూ ఉంటాడు.
అయితే ఆయన జీవితంలోకి అనుకోకుండా నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో ప్రవేశిస్తుంది దర్శన (కాశ్మీరీ).ఈమె బాగా యూట్యూబులో వీడియోస్ చేస్తూ ఉంటుంది.అయితే తన ఛానల్ మరింత క్రేజ్ పెరగాలని.నెంబర్ నైబర్ అనే కాన్సెప్ట్ తో విష్ణు తో పాటు శర్మ (మురళి శర్మ) ను కూడా కలిసి వీడియోలు తీస్తూ ఉంటుంది.
అయితే శర్మ ఒక మాట చెప్పటంతో ఆ మాటను సీరియస్గా తీసుకొని లైవ్ మర్డర్ ప్రాంక్ చేయాలని అనుకోని చేయగా.నిజంగానే శర్మ చనిపోతాడు.
దీంతో ఆమె జైలుకు వెళుతుంది.ఆ సమయంలో విష్ణు ఏం చేస్తాడు.
అసలు శర్మ ఎలా చనిపోయాడు.చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథలోనిది.

నటినటుల నటన:
కిరణ్ అబ్బవరం నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.పక్కింటి కుర్రాడిలా ఉంటూ చాలా నాచురల్ గా కనిపిస్తూ ఉంటాడు.ఇక ఈ సినిమాలో తన పాత్రతో బాగానే అదరగొట్టాడు.నటి కాశ్మీర కూడా పర్వాలేదు అన్నట్లుగా అనిపించింది.ఇక మిగతా నటీనటులంతా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

టెక్నికల్:
టెక్నికల్ పరంగా డైరెక్టర్ ఈ సినిమాకు మంచి కథను అందించాడు.ఇక పాటలు కూడా పరవాలేదు అన్నట్లుగా ఉన్నాయి.సినిమాటోగ్రఫీ కూడా బాగుంది.మిగిలిన టెక్నికల్ విభాగాలు సినిమాకు తగ్గట్టుగా పనిచేశాయి.
విశ్లేషణ:
ఈ సినిమా కథ కాస్త కొత్తగా, డిఫరెంట్ గా తెరకెక్కిందని చెప్పవచ్చు.డైరెక్టర్ కూడా ఈ సినిమాను ప్రతి పాయింట్ తో ఇంట్రెస్టింగ్ గా తీశాడు.మధ్యలో ట్విస్ట్ కూడా బాగా ఆసక్తిగా అనిపించింది.ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది.ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బాగుంటుంది.
ఇక సెకండ్ హాఫ్ కాస్త సిల్లీగా అనిపిస్తూ.స్లోగా సాగదీసినట్లు అనిపించింది.

ప్లస్ పాయింట్స్:
సినిమా కథ, నటీనటుల నటన, డైలాగ్స్, ట్విస్ట్, కామెడీ.
మైనస్ పాయింట్స్:
సెకండ్ హాఫ్ కాస్త సాగదీసినట్లు అనిపించింది.
బాటమ్ లైన్: చివరిగా చెప్పాల్సిందేంటంటే ఈ సినిమా మంచి కాన్సెప్ట్ తో పాటు ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.కాబట్టి ఈ సినిమాను చూడవచ్చు.