ప్రపంచం లోని ఆ ప్రాంతంలో అత్యధికశాతంలో మాంత్రికులు అక్కడ ఉన్నారు.వారి మాయా జాలం చూసి అందరూ ఆశ్చర్య పోతుంటారు.
ఇక్కడ జిరిగేది మాయ లేదా భ్రమ అనేది చెప్పడం కష్టం.మేజిక్ తెలిసిన, లేదా చేసే వ్యక్తిని ఇంద్రజాలికుడు అంటారు.
అద్భుతం, ఇంద్రజాలం, వశీకరణం లేదా తంత్ర-మంత్రం వంటి పదాలు కూడా మేజిక్ వర్గంలోకే వస్తాయి.మాయోంగ్ ఒక చేతబడి గ్రామం, భారతదేశం లోని అస్సాం రాజధాని గౌహతి నగరానికి 40 కి.మీ దూరంలో మోరిగావ్ జిల్లాలో పబిత్రా వన్యప్రాణుల అభయారణ్యం సమీపంలో ఈ గ్రామం ఉంది.దీనిని ‘ల్యాండ్ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్‘ అని పిలుస్తారు.‘మయోంగ్’ అనే పదం సంస్కృత పదం ‘మాయ‘ నుండి ఉద్భవించింది, దీని అర్థం భ్రమ.భ్రమలు కల్పించడంలో ఇక్కడి ప్రజలు నిష్ణాతులు.
కనుమరుగై మాయమయ్యే మాయాజాలం ఇక్కడి ప్రజలకు వెన్నతో పెట్టిన విద్య.ఇక్కడి ప్రజలు తమను తాము జంతువులుగా మార్చుకునే శక్తి కూడా కలిగి ఉంటారట.
ఇక్కడి అడవి జంతువులను తమ మాయా శక్తితో పెంపుడు జంతువులుగా వారు మార్చివేస్తారట.ఇక్కడి ప్రజలు మంత్రాలతో తమ నొప్పిని తగ్గించు కుంటారు.
దొంగలను పట్టుకుంటారు.మాయాజాలం చేస్తారు.
ఇక్కడి ప్రజలు వ్యవసాయంతో పాటు తమ పిల్లలకు మంత్రాలు కూడా నేర్పు తుంటారు.తరతరాలుగా ఇక్కడ చేతబడి, మంత్రవిద్యలు జరుగుతుంటాయి.
మాయోంగ్ గ్రామం చేతబడికి కేంద్రంగా పరిగణిస్తారు.ఇక్కడి ప్రజలకు మనుషులను జంతువులుగా మార్చివేసే కళ తెలసని చెబుతారు.
ఇది మాత్రమే కాదు ఇక్కడి ప్రజలు తమ మంత్ర శక్తితో గాలిలో అదృశ్యమవుతారని కూడా చెబుతుంటారు.సాహస ప్రియులు ఈ స్థలాన్ని అన్వేషించడానికి ఇష్టపడతారు.
ఈ ప్రదేశం బ్లాక్ మ్యాజిక్‌కు మాత్రమే కాకుండా, సహజ అందం కారణంగా కూడా ఎంతో పేరు సంపాదించింది.ఈ ప్రాంతంలోని రహస్యాల కారణంగా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.1332లో మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా.తన సైన్యంతో పాటు అస్సాంపై కవాతు చేశాడని చెబుతారు.
అప్పట్లో ఇక్కడున్న వేలాది మంది తాంత్రికులు మయోంగ్‌ను రక్షించడానికి వారు మాయా గోడను నిర్మించారు.దానిని దాటగానే సైనికులు అదృశ్యమయ్యేవారు.
ఆ సైన్యం ఏమైందో ఎవరికీ తెలియదని చెబుతారు.







