టాలీవుడ్ అగ్ర దర్శకుడిగా వెలుగొందుతున్న రాజమౌళి ఏ సినిమా చేసిన అది ట్రెండ్ సెట్ చేసే విధంగానే ఉంటుంది.ఆయన ప్రతి సినిమా ఒక ప్రయోగమే.
ఇప్పుడే కాదు ఆయన ఎప్పుడు సినిమా చేసిన అందులో పర్ఫెక్షన్ ఉంటుంది.తాజాగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ సినిమా ఆర్ఆర్ఆర్.
ఈ సినిమా మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా కోసం సినీ ప్రేక్షకులు మాత్రమే కాదు సెలబ్రిటీలు సైతం ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.దీంతో టీమ్ అంతా ఇన్ని రోజుల టెన్షన్ మరిచి హాయిగా రిలాక్స్ అయ్యారు.
ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీం గా నటిస్తే, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటించాడు.అందరు ఊహించిన విధంగానే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబడుతుంది.
ఇక్కడే కాదు ఈ సినిమా ఓవర్సీస్ లో కూడా ట్రేడ్ వర్గాలు సైతం ఆశ్చర్య పోయేలా వసూళ్లు చేస్తూ అక్కడ కూడా ఆర్ ఆర్ ఆర్ మ్యానియా చూపిస్తుంది.

అక్కడి ఫారినర్స్ ఆర్ ఆర్ ఆర్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.ఉత్తర అమెరికాలో ఇప్పటికే 440 కె డాలర్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.అక్కడ తెలుగు వారే కాకుండా ఫారినర్స్ కుల ఈ సినిమాను బాగా చూస్తున్నారు.

వీరు సినిమాలను చూడడమే కాకుండా ఆ సినిమాలో వారికీ నచ్చిన సీన్స్ ను సోషల్ మీడియా షేర్ చేస్తున్నారు.ఈ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడాలని వారు చేసే పోస్టులు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.మరొక విశేషం ఏంటంటే తెలుగు అస్సలు రాని ఫారినర్ తెలుగులో సినిమాను చూసి సోషల్ మీడియాలో ట్వీట్ చేయడం అందరికి ఆనందం కలిగిస్తుంది.ఇలా ఈ ఆర్ ఆర్ ఆర్ మ్యానియా ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.







