వరుస ప్లాప్స్ వస్తున్న తగ్గని క్రేజ్.. 'విక్రమ్' ప్రీ రిలీజ్ బిజినెస్ అన్ని కోట్లా?

యూనివర్సల్ స్టార్ గా పేరు తెచ్చుకున్నాడు కమల్ హాసన్.ఈయన తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేస్తాడు.

 Vikram Non-theatrical Rights Sold For A Bomb Details, Vikram, Universal Star Kam-TeluguStop.com

అయితే ఈయన హిట్ కొట్టి చాలా రోజులు అవుతుంది.అయినా కూడా కమల్ హాసన్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనే చెప్పాలి.

ఈయన సినిమాలు విభిన్నంగా ఉంటాయి.కమర్షియల్ హిట్ సాధించాక పోయిన రెగ్యురల్ ఫార్మాట్ లో కాకుండా విభిన్నమైన సినిమాలు చేస్తూ అలరిస్తూ ఉంటాడు.

ఈ క్రమంలోనే తాజాగా కమల్ హాసన్ నటించిన ‘విక్రమ్’ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ తెరకెక్కించాడు.ఈయన కూడా తన సినిమాలను విభిన్నంగా తెరకెక్కిస్తుంటాడు.ఈ క్రమంలోనే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇందులో విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కూడా నటించారు.ఈ ముగ్గురు కలయికలో సినిమా రావడంతో సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది.

Telugu Fahad Faisal, Ott, Satellite, Kamal Hassan, Vikram, Vikram Pre-Movie

ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు.వంద కోట్ల లోపే ఖర్చుతో ఈ సినిమా నిర్మించారు.అయితే ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 125 కోట్లు దక్కించుకున్నట్టు టాక్.

తాజాగా సాటిలైట్ రైట్స్ ఇంకా ఓటిటి రైట్స్ కూడా డీల్ క్లోజ్ అయ్యింది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇంకా స్టార్ అన్ని ఛానెల్స్ లో ఈ సినిమా టెలికాస్ట్ అవ్వనుంది.

Telugu Fahad Faisal, Ott, Satellite, Kamal Hassan, Vikram, Vikram Pre-Movie

తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం వర్షన్ లు అందుబాటులో ఉంటాయి.అయితే ఇంత భారీ బిజినెస్ జరగడంతో ఆయన క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అందరికి అర్ధం అవుతుంది.ఇటీవల కాలంలో అతి పెద్ద నాన్ థియేట్రికల్ బిజినెస్ ఇదే అట.కమల్ హాసన్ వరుస ప్లాపులతో ఉన్న కూడా ఇంత స్థాయిలో బిజినెస్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.మరి కమల్ ఈ సినిమాతో అనుకున్న రేంజ్ లో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube