హీరోగా విక్రమ్ వరుసగా చిత్రాలు చేస్తూనే ఉన్నాడు.సక్సెస్‌లు వరుసగా రాకున్నా కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.
ఇలాంటి సమయంలో విలన్‌గా టర్న్ అయ్యేందుకు విక్రమ్ సిద్దం అయ్యాడు.ఒక్కసారి విలన్‌గా నటిస్తే ప్రేక్షకులు మళ్లీ హీరోగా ఆధరిస్తారా అంటే అనుమానమే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కాని విక్రమ్ మాత్రం తన కొడుకు కోసం కెరీర్‌ను అయినా త్యాగం చేసేందుకు సిద్దం అంటూ ముందుకు వస్తున్నాడు.
విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా ఒక చిత్రం రూపొందబోతుంది.
ఈ చిత్రంలో విలన్ పాత్రను విక్రమ్ చేయబోతున్నాడు.ఆ విషయం ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చింది.
ప్రముఖ దర్శకుడు ప్రస్తుతం ఆ సినిమా కోసం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడు.కొడుకును హీరోగా నిలిపేందుకు విక్రమ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఏమేరకు సత్పలితాన్ని ఇస్తుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

విక్రమ్ తనయుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టినా కొట్టకున్నా కూడా కెరీర్ ప్రభావితం అవుతుంది.అలాగే విక్రమ్ కెరీర్ కూడా మళ్లీ హీరోగా చేసే అవకాశం ఉంటుందో లేదో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.ఇప్పటికే వయసు మీద పడిపోయింది.ఇలాంటి సమయంలో ఇలాంటి విలన్ వేశాలు వేస్తే ఇంకా ఏమైనా ఉందా అంటూ తమిళ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.