తమిళ సూపర్ స్టార్ ఇళయతలపతి విజయ్ నటిస్తోన్న తాజా చిత్రం బిజిల్ ప్రపంచవ్యాప్తంగా ఈ నెల అక్టోబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.దీపావళి కానుకగా రిలీజ్ కానున్న ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ప్రపంచవ్యా్ప్తంగా ఆసక్తిగా చూస్తున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్‌గ్రౌండ్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్లు పోస్టర్లు చూస్తే మనకు తెలుస్తోంది.
అయితే ఈ సినిమాను తెలుగులో విజిల్ అనే పేరుతో రిలీజ్ చేస్తున్నారు ప్రముఖ నిర్మత మహేష్ కోనేరు.
కాగా ఈ సినిమా నేడు సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది.సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసారు.
సినిమా చూసిన సెన్సార్ సభ్యులు విజిల్ వేశారని చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేశారు.మహిళలకు అంకితం అంటూ చిత్ర యూనిట్ పేర్కొన్న ఈ సినిమాలో కంటెంట్ అదిరిపోయింది అంటూ ప్రశంసలు గుప్పించారు.

ఇక ఈ సినిమాకు సెన్సార్ పనులు కూడా పూర్తి కావడంతో రిలీజ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది విజిల్ చిత్ర యూనిట్.మరి విజయ్ ఈ సినిమాతో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అని కోలీవుడ్ వర్గాలతో పాటు టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఎదురుచూస్తున్నారు.ఈ సినిమాను తెలుగులో రెండు రాష్ట్రాల్లో ఏకంగా 700 స్క్రీన్లలో రిలీజ్ చేస్తున్నారు.