రాజ్యసభ జీరో అవర్ లో టీటీడీ విషయంలో కేంద్ర హోంశాఖ తీరుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి విదేశాల నుండి వచ్చే విరాళాలను కేంద్ర హోంశాఖ అడ్డుకుంటుందని చెప్పుకొచ్చారు.
టీటీడీ అనేక ధార్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని.ఈ కార్య కలాపాలకు భారీగా నిధులు అవసరమని చెప్పుకొచ్చారు.
అంతే కాకుండా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.
ఒక్క ఉత్తర భారతదేశం అని మాత్రమే కాకుండా దక్షిణ భారత దేశాన్ని కూడా పట్టించుకోవాలని కోరారు.
టీటీడీ ధార్మిక సంస్థ సామాజిక, సాంస్కృతిక.విద్య పరంగా అదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.
ఒక్క ఉత్తరాది రాష్ట్రాలను మాత్రమే కాక దక్షిణాదిలో టిటిడి విషయంలో కూడా బీజేపీ అనుకూలంగా వ్యవహరించాలని రాజ్యసభ లో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.దీంతో విజయసాయి రెడ్డి చేసినా కామెంట్స్ అటూ రాష్ట్ర రాజకీయాలలో…ఇటు జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారాయి.