జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు.ఈ సమావేశంలో అధికార పార్టీ వైసీపీ పై పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో మండిపడ్డారు.
వైసీపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిన ప్రభుత్వం అని 2024 ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం రాదు అని జోస్యం చెప్పారు.అంతమాత్రమే కాదు వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ఓటు అడిగే హక్కు లేదని కూడా స్పష్టం చేశారు.ఇటువంటి తరుణంలో పవన్ చేసిన వ్యాఖ్యలకు వైసిపి సీనియర్ నేత విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో పరోక్షంగా కౌంటర్లు వేశారు.
“2014లో మోదీని పీఎం కానివ్వనంటూ ముంబైలో సోనియా శపథం.మోదీ టీ అమ్ముకో అంటూ మరొకరు ఎగతాళి.2024లో జగన్ గారిని సీఎం కానివ్వబోమంటూ రాష్ట్రంలో కొన్ని పార్టీలు ఇలాంటి సవాళ్ళే చేస్తున్నారు.ప్రజాస్వామ్యంలో ఎవరిని ఎక్కడ ఉంచాలో నిర్ణయించేంది ప్రజలే.మధ్యలో ఈ శిఖండి ప్రకటనలేంటి బాబులూ?”.అంటూ ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి చెలరేగిపోయారు.మరోపక్క పవన్ వ్యాఖ్యలపై మరికొంతమంది వైసీపీ నేతలు చంద్రబాబు దర్శకత్వంలోనే పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారని.2024 ఎన్నికల్లో జనసేన పార్టీ కార్యకర్తలతో అభిమానులతో టిడిపి జెండాలు పవన్ మోయించడం గ్యారెంటీ అని అంటున్నారు.







