‘ఎఫ్ 2’ చిత్రంతో ఈ ఏడాది బ్లాక్ బస్టర్‌ను తెలుగు సినిమా పరిశ్రమకు అందించిన అనీల్ రావిపూడి ప్రస్తుతం మహేష్ బాబు కోసం స్క్రిప్ట్‌ను సిద్దం చేసే పనిలో ఉన్నాడు.మహేష్‌బాబు 26వ చిత్రంకు అనీల్ రావిపూడి దర్శకత్వం వహించబోతున్నాడు అనే విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది.
మరి కొన్ని వారాల్లోనే షూటింగ్ కూడా ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సమయంలోనే సినిమాలోని కీలక పాత్రల కోసం కన్నడ నటుడు ఉపేంద్ర మరియు సీనియర్ మాజీ హీరోయిన్ విజయశాంతిని అనీల్ రావిపూడి సంప్రదించినట్లుగా తెలుస్తోంది.
ఇటీవలే ఉపేంద్ర తనను మహేష్ బాబు సినిమా కోసం సంప్రదించిన మాట వాస్తవమే.కాని నేను ఆ సినిమాలో నటించలేక పోతున్నాను.వారు అడిగిన డేట్లు నా వద్ద ఖాళీ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ సినిమాను వదిలేయాల్సి వచ్చిందని క్లారిటీ ఇచ్చిన విషయం తెల్సిందే.ఇక ఇదే సమయంలో రాములమ్మను కూడా అనీల్ రావిపూడి సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే ఆమె ఆన్సర్ ఏంటీ అనే విషయంలో ఇంకా ఎలాంటి క్లారిటీ రావడం లేదు.

అనీల్ రావిపూడి స్వయంగా వెళ్లి విజయశాంతికి స్టోరీని వినిపించడం జరిగింది.పాత్ర తీరు, మహేష్‌బాబు సినిమాలో హీరోయిన్ పాత్ర అన్ని రకాలుగా విజయశాంతికి దర్శకుడు తెలియజేశాడట.ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని అనీల్ రావిపూడికి చెప్పిందట.
చాలా సంవత్సరాల క్రితమే మహేష్ బాబుకు విజయశాంతి అమ్మ పాత్రలో నటించింది.అలాంటి విజయశాంతి మళ్లీ మహేష్ బాబు సినిమాలో నటించడం అంటే ఫ్యాన్స్‌కు పండగే.
మరి రాములమ్మ ఆన్సర్ ఏంటీ అనేది చూడాలి.