రాజకీయాలకు రాములమ్మ దూరమేనా ?

ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ కు అండదండగా ఉంటూ వచ్చారు విజయశాంతి.మొదట్లో టిఆర్ఎస్ పార్టీలో చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆ తర్వాత కేసీఆర్ తో వచ్చిన మనస్పర్ధలు, ఆధిపత్యపోరు కారణంగా ఆ పార్టీకి దూరమై కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఆ పార్టీలో ఆమెకు మొదట్లో మంచి గుర్తింపే దక్కినా జాతీయ స్థాయిలోనూ, రాష్ట్ర స్థాయిలోనూ కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ రావడం, ఇప్పట్లో ఆ పార్టీ పుంజుకునే అవకాశం లేకపోవడంతో విజయశాంతి క్రమక్రమంగా ఆ పార్టీకి దూరం అవుతూ వస్తున్నారు.

ప్రస్తుతానికి ఆయన కాంగ్రెస్ లోనే ఉన్నా ఆ పార్టీ కార్యక్రమాలు వేటికీ హాజరు కావడం లేదు.

తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా వ్యవహరించిన విజయశాంతి ఆ తర్వాత పార్టీ కార్యాలయం ముఖం కూడా చూడలేదు.దీంతో పార్టీ కూడా ఆమెను పక్కన పెట్టేసింది.నాయకులు ఎవరూ ఆమెను పట్టించుకోవడంలేదనే విషయం ప్రచారంలోకి వచ్చింది.

Advertisement

కోర్ కమిటీ సమావేశాలకు, మున్సిపల్ ఎన్నికల ప్రచారం కోసం కానీ ఇప్పటి వరకు ఆమెకు ఆహ్వానం రాకపోవడంతో కాంగ్రెస్ ఆమెను దూరం పెట్టింది అనే విషయం బయటపడింది.ఈ నేపథ్యంలో ఆమె రాజకీయాలకు దూరంగా జరిగి మళ్లీ సినిమాల్లో బిజీ అవుతారా అనే చర్చ నడుస్తోంది.

ప్రస్తుతం ఆమె మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో కీలక పాత్రలో నటించారు.13 ఏళ్ల విరామం తర్వాత ఆమె నటించిన చిత్రం ఇది.ఇందులో ప్రొఫెసర్ పాత్రలో ఆమె కనిపించబోతున్నారు.సినిమా అవకాశాలు క్రమక్రమంగా పెరుగుతుండడంతో రాజకీయాలకు గుడ్ బాయ్ చెప్పి ఇక సినిమాల్లోని కొనసాగాలి అని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం ఒకవైపు జరుగుతుండగా, ఆమె బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, ఆ పార్టీ అధిష్టానం నుంచి సరైన భరోసా లభించగానే బీజేపీలో చేరతారనే మరో వాదన తెరమీదకు వస్తోంది.

అయితే ఈ విషయంలో ఆమె అభిప్రాయం ఏంటో ఇప్పటి వరకు బయట పడలేదు.

పెళ్లిళ్ల సీజన్ వచ్చింది తులం బంగారం తూచేనా ? 
Advertisement

తాజా వార్తలు