మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో జరగబోతున్న విషయం తెలిసిందే.భారీ ఎత్తున అక్కడ ఇప్పటికే ఏర్పాట్లు మొదలయ్యాయి.
హైదరాబాదులోనే ఎక్కువ శాతం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్స్ జరుగుతున్నాయి.కానీ ఎందుకు ఈ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో నిర్వహిస్తున్నారు అనే ప్రశ్నకు గాడ్ ఫాదర్ చిత్ర యూనిట్ సభ్యుల నుండి సరైన సమాధానం లభించడం లేదు.
మెగాస్టార్ చిరంజీవి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఏమైనా ఆ విషయమై మాట్లాడుతాడేమో చూడాలి.ఇక ఏపీలో ముఖ్యంగా అనంతపురం లో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో స్థానిక నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీని సినిమా రాజధానిగా మార్చేందుకు జగన్మోహన్ ప్రభుత్వం ప్రయత్నించింది, కానీ ఇప్పటికే హైదరాబాదులో సెటిల్ అయినా ఏ ఒక్క టాలీవుడ్ ప్రముఖులు కూడా ఏపీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించలేదు.ఇప్పుడు మెల్ల మెల్లగా సినిమా కార్యక్రమాలు ఏపీలో జరుగుతున్న కారణంగా సినిమా ఇండస్ట్రీ ఏపీలో పెరిగే అవకాశం ఉందని అంతా భావిస్తున్నారు.
చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురం లో జరగబోతున్న నేపథ్యం లో వైకాపా ఎంపీ విజయ సాయి రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

మెగాస్టార్ చిరంజీవి గారి సందేశాత్మక చిత్రం గాడ్ ఫాదర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆంధ్రాలో చేస్తుండడం సంతోషకరం, ఆయనకు నా శుభాకాంక్షలు.నాలుగున్నర దశాబ్దాలుగా చిత్ర సీమను రంజింపజేస్తున్న మెగాస్టార్ లో అదే ఉత్సాహం.ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ తో మెగాస్టార్ చిరంజీవి అభిమానులను మరియు మెగాస్టార్ ని వైకాపా వైపు తిప్పుకునే ఉద్దేశం ఏమైనా ఉందా విజయ సాయి రెడ్డి గారు అంటూ కొందరు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.







