'వారిసు' ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంత రాబట్టాడో తెలుసా?

ఇళయ దళపతి విజయ్ జోసెఫ్ ‘వారిసు‘ సినిమాతో నిన్న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.కోలీవుడ్ లో భారీ అంచనాలను నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా నిన్న జనవరి 11న తెలుగులో తప్ప మిగిలిన అన్ని చోట్ల గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Vijay Varisu Box Office Collection Day 1 Details, Rashmika Mandanna, Vamsi Paidi-TeluguStop.com

తెలుగు డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది.

ఇక ఈ క్రేజీ సినిమాను దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నాడు.

ఇదిలా ఉండగా ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.తెలుగులో కూడా దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆయన పాచికలు పారలేదు.

థియేటర్స్ సమస్య కారణంగా ఈ సినిమాను తెలుగులో వాయిదా వేస్తున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు.ఇక తెలుగులో ఈ సినిమా జనవరి 14న రిలీజ్ కాబోతుంది.ఇదిలా ఉండగా ఈ సినిమా నిన్న బాక్సాఫీస్ దగ్గర ఎంత వసూళ్లు రాబట్టింది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 137.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 138 కోట్ల టార్గెట్ తో విజయ్ బరిలోకి దిగాడు.

ఈ సినిమా టాక్ ఎలా ఉన్న ఫస్ట్ డే మాత్రం సాలిడ్ కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.మొదటి రోజు ఈ సినిమా తమిళనాడులో 20.15 కోట్ల వరకు ఓపెనింగ్స్ రాబట్టినట్టు టాక్.తమిళ్ లోనే కాదు మిగతా రాష్ట్రాల్లో కూడా ఈసారి విజయ్ కు మంచి కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తుంది.వరల్డ్ వైడ్ గా ఈ సినిమా మొదటి రోజు 46.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ 23.60 కోట్ల షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుందట.మరి ఈ సినిమా పండుగ రోజుల్లో ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో వేచి చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube