కోలీవుడ్ కింగ్ గా విజయ్.. గత ఐదేళ్ల రికార్డులు ఇవే!

కోలీవుడ్ స్టార్ హీరోల్లో దళపతి విజయ్ జోసెఫ్ ఒకరు.ఈయన తమిళ్ లో ఓ రేంజ్ లో ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు.

 Vijay Thalapathy As New Record In Tamil Cinema,  Vijay Thalapathy, Kollywood, Va-TeluguStop.com

రజనీకాంత్ తర్వాత కోలీవుడ్ లో అంతటి ఫాలోయింగ్ విజయ్ దళపతికి మాత్రమే ఉంది.తెలుగులో పవన్ కళ్యాణ్ కు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో తమిళ్ లో విజయ్ కు ఆ రేంజ్ ఫాలోయింగ్ ఉంది.

ఈయన మాట్లాడేది తక్కువ అయినప్పటికీ తన యాటిట్యూడ్ తమిళ్ ప్రేక్షకులకు పిచ్చి అనే చెప్పాలి.

విజయ్ ఇటు మాస్ ఆడియెన్స్ ను మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియెన్స్ ను సైతం మెప్పిస్తాడు.

ఈ మధ్యకాలంలో విజయ్ దళపతి మాత్రమే తమిళ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నారు.గత ఐదేళ్ల కాలంలో ప్లాప్ లేకుండా వరుస హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.

అంతేకాదు ఈయన సినిమా మినిమమ్ 100 కోట్లు చాలా ఈజీగా వచ్చేస్తుంది.

Telugu Kollywood, Master, Rashmika, Trisha, Varisu, Vijaythalapathy-Movie

తాజాగా వచ్చిన వారిసు సినిమాతో కూడా మంచి వసూళ్లు చేసాడు.గత కొన్నేళ్ల నుండి విజయ్ సినిమాల కలెక్షన్స్ షేర్ చుస్తే.మొదటి స్థానంలో మాస్టర్ సినిమా 141 కోట్ల షేర్ రాబట్టగా.

రెండవ స్థానంలో 139 కోట్ల షేర్ రాబట్టింది.మూడవ స్థానంలో 137 కోట్లతో వారిసు సినిమా ఉంది.

ఆ తర్వాత సర్కారు సినిమా 125 కోట్ల షేర్, మెర్సల్ 120 కోట్ల షేర్ రాబట్టింది.బీస్ట్ సినిమా 113 కోట్ల షేర్ రాబట్టింది.

Telugu Kollywood, Master, Rashmika, Trisha, Varisu, Vijaythalapathy-Movie

ఇలా వరుసగా 100 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెడుతున్నాడు.ఇదిలా ఉండగా ప్రెజెంట్ విజయ్ 67వ సినిమాను కూడా స్టార్ట్ చేసాడు.మాస్టర్ వంటి సినిమాను తెరకెక్కించిన లోకేష్ కనకరాజ్ తో లియో సినిమా స్టార్ట్ చేసారు.ఈ సినిమాలో విజయ్ కు జోడీగా త్రిష నటిస్తుండగా.సెవన్ స్క్రీన్ స్టూడియో పై లలిత్ కుమార్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube