ప్రమాదంలో విజయ్ సేతుపతి కెరీర్.. ఏమైందంటే..?

ఈ మధ్య కాలంలో తెలుగులో విజయ్ సేతుపతి పేరు మారుమ్రోగుతున్న సంగతి సంగతి తెలిసిందే.

గత నెల 12వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఉప్పెన మూవీ విడుదల కాగా ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు ఆ మూవీలో నటించిన విజయ్ సేతుపతి పాత్రకు మంచి పేరు వచ్చింది.

తెలుగులో చాలామంది స్టార్ హీరోలు విజయ్ సేతుపతిని తమ సినిమాల్లో విలన్ గా నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.జూనియర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే సినిమాలో కూడా విజయ్ సేతుపతి పేరే వినిపిస్తుండగా జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

అయితే కొంతమంది నిర్మాతలు చేస్తున్న పనుల వల్ల విజయ్ సేతుపతి క్రేజ్ తగ్గుతుందని తెలుస్తోంది.తెలుగులో విజయ్ సేతుపతికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో కొందరు నిర్మాతలు విజయ్ తమిళంలో నటించి ఎప్పుడో విడుదలైన సినిమాల హక్కులను కొనుగోలు చేస్తున్నారు.

ఇలా తెలుగులో విడుదల కాబోతున్న సినిమాలలో విజయ్ సేతుపతి హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.గతంలో కూడా కొందరు తమిళ హీరోలు నటించిన సినిమాలు ఈ విధంగా విడుదలయ్యాయి.తమిళంలోనే ఫ్లాప్ అయిన సినిమాలు తెలుగులో విడుదలైతే ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Advertisement

రాబోయే రోజుల్లో విడుదల తెలుగులో విడుదల కాబోతున్న డబ్బింగ్ సినిమాలు విజయ్ సేతుపతి కెరీర్ పై ప్రభావం చూపుతాయేమో చూడాల్సి ఉంది. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో కూడా మొదట విజయ్ సేతుపతికే విలన్ రోల్ పోషించే ఛాన్స్ దక్కగా డేట్స్ విషయంలో సమస్య రావడంతో విజయ్ సేతుపతి ఈ సినిమా నుంచి తప్పుకున్నారు.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు