మక్కల్ సెల్వన్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయ్ సేతుపతి( Vijay Sethupathi ) హీరోగా ఎంత మంచి పాత్రల్లో నటించి అభిమానులను అలరించాడో విలనిజంతో కూడా అదే రేంజ్ లో అభిమానులను సంపాదించుకున్నాడు.మన తెలుగులో ఉప్పెన సినిమా( Uppena Movie ) మాత్రమే అతడు విలన్ గా చేసిన సినిమా.
అయితే జవాన్ సినిమాలో( Jawan ) ఇటీవల బాలీవుడ్ లో విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు విజయ్.అంతకన్నా ముందు తమిళ్ లో కూడా మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాల్లో నటించాడు అయితే ఎన్ని సినిమాల్లో విలనిజంతో నటించిన ఎందుకు అతనిలో ఒక వైరాగ్యం మొదలయ్యిందో తెలియదు కానీ ప్రస్తుతం ఇకపై ఎలాంటి విలన్ వేషాలు( Villain Roles ) వెయ్యబోనంటూ స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాడు మన మక్కల్ సెల్వన్.

కేవలం హీరో కథలను మాత్రమే తీసుకురండి అంటూ దర్శక నిర్మాతలకు ఆర్డర్ వేసాడట.నేను చేయాలనుకున్న పాత్రలన్నీ చేసేసాను ఇకపై కేవలం హీరో గానే కట్టి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను.అలాంటి కథలు ఉంటే చెప్పండి అంటూ వచ్చిన నిర్మాతలకు క్లియర్ గానే చెప్తున్నాడు.ఇటీవల నార్త్ రామాయణం సినిమాలో( Ramayanam Movie ) విభీషణుడి పాత్ర కోసం విజయ్ సేతుపతికి ఆఫర్ వస్తే ఒక నిమిషం కూడా ఆలోచించకుండా రిజెక్ట్ చేశాడట.
ఇంత పెద్ద ఫ్యాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి విజయ్ సేతుపతి తప్పుకోవడంతో ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారట.ఒక పెద్ద సినిమాలో ఆఫర్ ని విజయ్ ఇంత నిర్లక్ష్యంగా కొట్టి పారేశాడు ఏంటి అని సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.

విజయ్ సేతుపతి తన నిర్ణయాన్ని చాలా తొందరపడి తీసుకున్నాడా ఏంటి అని అనుమానం కూడా కొందరిలో వస్తుంది.ఎందుకంటే ఇప్పుడిప్పుడే సౌత్ ఇండియా నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విజయ్ సేతుపతి మరిన్ని మంచి సినిమాల్లో మంచి పాత్రలు నటించాల్సిన అవసరం ఉంది.అలా అని తానే మీ తక్కువ నటుడు కాదు.విజయ్ స్క్రీన్ పైన కనిపిస్తే చాలు అది ఎంతో నిండుగా కనిపిస్తుంది.మరి కథలను ఎంచుకోవడానికి కూడా విజయ్ సేతుపతి చాలా సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది.అసలు విజయ్ సేతుపతి ఏం చేయాలనుకుంటున్నాడో మరికొన్ని రోజులు ఆగి చూస్తే కానీ తెలిసే అవకాశం లేదు.