వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు పై పరోక్షంగా విమర్శలు చేశారు.ట్విట్టర్ వేదికగా టీడీపీ నేతల పై విమర్శలు చేసే విజయ్ సాయి రెడ్డి మరోసారి తన ట్విట్టర్ కు పని పెట్టారు.
ప్రస్తుతం ఏపీ లో చోటుచేసుకున్న పరిణామాలపై ఆయన స్పందిస్తూ రాష్ట్రానికి మూడు రాజధానులు వద్దని కొందరు వాదిస్తున్నారు, అయితే మూడు రాజధానుల వల్ల కలిగే ప్రయోజనాలు వారికి తెలియడం లేదు అని అన్నారు.అంతేకాకుండా ఇంతగా మూడు రాజధానులు వద్దని వారిస్తున్న వారి తాపత్రయం లో కేవలం చంద్రబాబు సేవలో తరించాలి అన్న తాపత్రయం తప్ప రాష్ట్ర ప్రజల ప్రయోజనం మాత్రం కనిపించడం లేదని విమర్శించారు.

ఈ రోజు రాజకీయాల్లో పైసా కు కూడా కొరగాని వాళ్లు కూడా రంకెలు వేస్తున్నారు అంటూ విజయ్ సాయి రెడ్డి విమర్శించారు.అయితే చంద్రబాబుకు భజన చేయాలనుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని, కానీ రాజధాని అంశంలో అవగాహన లేకుండా మాట్లాడొద్దని హితవు పలుకుతూ విజయ్ సాయి రెడ్డి తనదైన శైలి లో ట్వీట్ చేశారు.ఏపీ రాజధానిని అమరావతి నుంచి తరలించడం పై టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో టీడీపీ నేతల అరెస్ట్ లు కూడా చోటుచేసుకున్నాయి.