తమిళ్ సూపర్ స్టార్ విజయ్ హీరో గా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెలుగు నిర్మాత దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా ఈ సంక్రాంతి కానుకగా జనవరి 11వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ తమిళనాడు విడుదల కాబోతున్న ఈ సినిమా తెలుగు లో మాత్రం పెద్దగా క్రేజ్ లేకుండానే భారీ ఎత్తున విడుదల కాబోతుంది.
తెలుగు లో గతం లో విజయ్ ఏ ఒక్క సినిమా తో సక్సెస్ దక్కించుకోలేక పోయాడు.అలాగే భారీ ఎత్తున కలెక్షన్స్ నమోదు చేయలేక పోయాడు.
కనుక వారసుడు సినిమా తో అయినా ఆ ఘనత దక్కించుకుంటాడా అనేది అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.
వారసుడు సినిమా ను తెలుగు సినిమా గా దిల్ రాజు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఒక తెలుగు సినిమా విడుదల అవుతున్న నేపద్యం లో దాని యొక్క హీరో మీడియా ముందు వారం రోజుల ముందు నుండి సందడి చేయడం మనం చూస్తూ ఉంటాం, కానీ వారసుడు సినిమా యొక్క హీరో విజయ్ ఇప్పటి వరకు తెలుగు మీడియా ముందుకు రాకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం అవుతుంది.విజయ్ తన యొక్క సోషల్ మీడియా లో కూడా తెలుగు వారసుడు గురించి ఎక్కువగా ప్రస్తావించడం లేదు,
కేవలం తమిళ్ వారసుడు సినిమా గురించి ఆయన ఎక్కువ మాట్లాడుతున్నాడు.తెలుగు లో ప్రచారానికి రాని విజయ్ తో ఎందుకు సినిమా చేయడం అంటూ దిల్ రాజు ని కొందరు ప్రశ్నిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వారసుడు సినిమా ను తెలుగు లో చూడాల్సిన అవసరం లేదు అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు.ఇక్కడికి రావడానికి ఇష్టం లేని విజయ్ కి మనము ఎందుకు కలెక్షన్స్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా లో పలువురు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
మరి విజయ్ సినిమా విడుదల సమయానికి అయినా ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తాడా అనేది చూడాలి.