ఖుషి మరింత లేట్ కాబోతుందా..?

విజయ్ దేవరకొండ లైగర్ తర్వాత సెట్స్ మీద ఉన్న ఖుషి అయినా పూర్తి చేద్దామని అనుకోగా అది కూడా లేట్ అవుతూ వస్తుంది.

సమంత అనారోగ్యం వల్ల ఆ సినిమా కూడా అనుకున్న విధంగా షూటింగ్ జరగట్లేదు.

అందుకే విజయ్ ఈ గ్యాప్ లో తన నెక్స్ట్ సినిమా గౌతం తిన్ననూరి సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని ఫిక్స్ అయ్యాడు.ఎక్కువగా ఖాళీగా ఉన్నా టైం వేస్ట్ అవుతుందని భావించిన రౌడీ హీరో గౌతం సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

జెర్సీ తర్వాత గౌతం కి నేషనల్ వైడ్ సూపర్ క్రేజ్ ఏర్పడింది.మరోసారి అలాంటి స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తోనే విజయ్ తో సినిమా చేస్తున్నాడు గౌతం.

అయితే ఈసారి క్రికెట్ కాకుండా వేరే ఆట తో వస్తున్నాడట గౌతం.విజయ్ దేవరకొండ మార్క్ మేనరిజం తో సినిమా చాలా స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్నారట.

Advertisement

ఈ సినిమాని కూడా విజయ్ పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.లైగర్ హిట్ అయితే పరిస్థితి వేరేలా ఉండేది కానీ అది ఫ్లాప్ అవడం వల్ల విజయ్ తన సినిమాల విషయంలో ఆచి తూచి అడుగులేస్తున్నాడు.

హీరో తేజ సజ్జాకు పాదాభివందనం చేసిన పెద్దాయన.. అసలేం జరిగిందంటే?
Advertisement

తాజా వార్తలు