ఆ హీరో అయిదు కోట్లు ఇచ్చేసాడు

శ్రీమంతుడు సినిమా ఎం నేర్పించింది ? మనకి అవసరైమన దానికన్నా ఎక్కువ అంటే దాన్ని అవసరం ఉన్నవాళ్లకి ఇచ్చేయమని.సాటి మనిషి కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఒక సమాజంలో, ఒక సంఘంగా బ్రతకడం ఎందుకని.

 Vijay Donates 5 Crore For Chennai Floods-TeluguStop.com

తానూ నిజమైన శ్రీమంతుడినని నిరూపించుకున్నాడు తమిళ హీరో ఇళయతలపతి విజయ్.

చెన్నై వాసులంతా భారి వర్షాలతో రోడ్డుమీద పడితే చూడలేకపోయాడు విజయ్.

పెద్ద మనసు చేసుకొని పెద్దమనిషి లా తమిళ ప్రజలకు అండగా నిలబడ్డాడు.చెన్నై వరద బాధితుల సహాయార్థం ఏకంగా 5 కోట్లు ఇస్తున్నాడు విజయ్.

ఇప్పటివరకు డబ్బులిచ్చిన దాతలలో విజయ్ దే పెద్ద చేయి.ఇక మరో అగ్ర హీరో అజిత్ తన వాటాగా 60 లక్షలు విరాళంగా ప్రకటించాడు.

నటుడు, దర్శకుడు, కోరియోగ్రఫేర్ రాఘవ లారెన్స్ కోటి రూపాయలు ప్రకటించాడు.

తెలుగు నటుల్లో అల్లు అర్జున్ 25 లక్షలు, ప్రభాస్ 15 లక్షలు, మహేష్ బాబు 10 లక్షలు, ఎన్టీఆర్ 10 లక్షలు, రవితేజ 5 లక్షలు, వరుణ్ తేజ్ 3 లక్షలు, సాయి ధరమ్ తేజ్ 3 లక్షల మెడికల్ సామాగ్రి, సందీప్ కిషన్ 5,000 ఆహార ప్యాకేట్స్, సంపూర్నేష్ బాబు 50 వేలు తమవంతు సహాయంగా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube