తగ్గేదేలే అంటున్న దిల్ రాజు.. 'ఫ్యామిలీ స్టార్' పక్కా రిలీజ్!

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.ఈ యంగ్ హీరో ఇటీవలే ఖుషి వంటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

 Vijay Deverakonda’s Family Star In Sankranthi Race, Vijay Deverakonda, Family-TeluguStop.com

ఇలాంటి సక్సెస్ తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.అందులో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.‘ఫ్యామిలీ స్టార్‘ ( Family Star ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.

అందులోను విజయ్, పరశురామ్ కాంబో ఇప్పటికే గీతా గోవిందం వంటి ఘన విజయం అందుకోవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి.ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే.ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.

మరి దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి రేసులోనే నిలిపేందుకు మేకర్స్ టైం ఫిక్స్ చేసుకుని సంక్రాంతికే రిలీజ్ అని కూడా ప్రకటించారు.కానీ ఇటీవల ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్టు టాక్ వచ్చింది.

కానీ తాజాగా ఈ వార్తలపై క్లారిటీ తెలుస్తుంది.ఈ మూవీ షూట్ అమెరికాలో జరగాల్సి ఉండగా వీసాల ఆలస్యం వల్ల వాయిదా పడింది అంటూ టాక్ రాగా ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయ్యిందని అమెరికాలో అతి త్వరలోనే షూట్ పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేసి పక్కాగా ఈ మూవీను అనుకున్న విధంగా సంక్రాంతికే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.చూడాలి దిల్ రాజు పట్టుదల నెగ్గుతుందో లేదో.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube