తగ్గేదేలే అంటున్న దిల్ రాజు.. ‘ఫ్యామిలీ స్టార్’ పక్కా రిలీజ్!

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు.

ఈ యంగ్ హీరో ఇటీవలే ఖుషి వంటి సక్సెస్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఇలాంటి సక్సెస్ తర్వాత మరో రెండు సినిమాలను సెట్స్ మీదకు తీసుకు వెళ్ళాడు.

అందులో పరశురామ్ తో చేస్తున్న ప్రాజెక్ట్ ఒకటి.'ఫ్యామిలీ స్టార్' ( Family Star ) అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగానే ఉన్నాయి.

"""/" / అందులోను విజయ్, పరశురామ్ కాంబో ఇప్పటికే గీతా గోవిందం వంటి ఘన విజయం అందుకోవడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగాయి.

ప్రజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో విజయ్ కు జోడిగా మృణాల్ ఠాకూర్ ( Mrunal Thakur ) హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే.

ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్న విషయం తెలిసిందే.మరి దిల్ రాజు నిర్మాత కావడంతో ఈ సినిమాను ఎలాగైనా సంక్రాంతి రేసులోనే నిలిపేందుకు మేకర్స్ టైం ఫిక్స్ చేసుకుని సంక్రాంతికే రిలీజ్ అని కూడా ప్రకటించారు.

కానీ ఇటీవల ఈ సినిమా సంక్రాంతి రేసు నుండి తప్పుకున్నట్టు టాక్ వచ్చింది.

"""/" / కానీ తాజాగా ఈ వార్తలపై క్లారిటీ తెలుస్తుంది.ఈ మూవీ షూట్ అమెరికాలో జరగాల్సి ఉండగా వీసాల ఆలస్యం వల్ల వాయిదా పడింది అంటూ టాక్ రాగా ఇప్పుడు ఇది కూడా క్లియర్ అయ్యిందని అమెరికాలో అతి త్వరలోనే షూట్ పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన బ్యాలెన్స్ వర్క్ కూడా పూర్తి చేసి పక్కాగా ఈ మూవీను అనుకున్న విధంగా సంక్రాంతికే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది.

చూడాలి దిల్ రాజు పట్టుదల నెగ్గుతుందో లేదో.

దేవకట్టా డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ సినిమా చేయబోతున్నాడా..?