VD13 : టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కు మేకర్స్ సిద్ధం.. ఎప్పుడంటే?

యంగ్ హీరోల్లో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) ఒకరు విజయ్ ప్రస్తుతం ఖుషీ తో వచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు.ఎందుకంటే గత సినిమా లైగర్ అట్టర్ ప్లాప్ అయ్యి విజయ్ ఆశలన్నీ గల్లంతు చేసాయి.

 Vijay Deverakonda Vd13 Title And First Look Release-TeluguStop.com

దీంతో నెక్స్ట్ చేసిన ఖుషీ సినిమా మీదనే విజయ్ ఆశలన్నీ పెట్టుకున్నాడు.తనకు ఎంతగానో కలిసి వచ్చిన లవ్ స్టోరీతో ఈ సినిమా తెరకెక్కింది.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను శివ నిర్వాణ( Shiva Nirvana ) డైరెక్ట్ చేయగా సెప్టెంబర్ 1న రిలీజ్ అయ్యి మంచి విజయం అందుకుంది.ఇక విజయ్ ప్రజెంట్ ఈ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తూనే తన నెక్స్ట్ సినిమా షూటింగ్ లో బిజీ అయ్యాడు.

విజయ్ నెక్స్ట్ సినిమాను గీతా గోవిందం వంటి ఘన విజయం అందించిన పరశురామ్ తో చేస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాను ఇటీవలే షూట్ కూడా స్టార్ట్ చేసారు.

Telugu Dil Raju, Mrunal Thakur, Parasuram, Sankranthi, Vd-Movie

‘VD13’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూట్ శరవేగంగా జరుపుకుంటుంది .ఇప్పటికే 50 శాతం పైగానే షూట్ పూర్తి అయినట్టు టాక్.ఈ సినిమాపై విజయ్ ఫ్యాన్స్ తో పాటు మిగిలిన ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి ఒక వార్త వైరల్ అయ్యింది.

ఈ సినిమా నుండి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అతి త్వరలోనే రాబోతుందట.

Telugu Dil Raju, Mrunal Thakur, Parasuram, Sankranthi, Vd-Movie

ఇందుకు మేకర్స్ అన్ని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.త్వరలోనే అధికారిక ప్రకటన సైతం రానుందని టాక్.ఇక గోపి సుందర్ సంగీతం అందిస్తుండగా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కుతుంది.

ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.కాగా ఈ సినిమా 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్టు ముందుగానే ప్రకటించి దిల్ రాజు సంక్రాంతి బరిలో ఈసారి కూడా తన మూవీ ఉండేలా చూసుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube