Vijay Deverakonda Rashmika: ఫ్యామిలీతో రెస్టారెంట్ కి వెళ్లిన రష్మిక,విజయ్.. పెళ్లి పనులు షురూ చేసారా?

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ,( Vijay Deverakonda ) నేషనల్ క్రష్, పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన( Rashmika ) ప్రేమలో మునిగితేలుతున్నారు అంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఈ జంట విషయంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.

 Vijay Deverakonda Rashmika Mandanna Spotted Together Restaurant-TeluguStop.com

కానీ రష్మిక విజయ్ లు మాత్రం ఆ వార్తల్లో నిజం లేదని కొట్టి పడేస్తున్నారు.లవ్, రిలేషన్ షిప్ లేదంటూనే కలిసి పార్టీలకు వెళ్లడం వెకేషన్ లు తిరగడం పార్టీలు చేసుకోవడంతో ఆ అనుమానాలకు మరింత ఆజ్యం పోసినట్టు అయింది.

Telugu Restaurant, Tollywood-Movie

వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో సార్లు వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేసిన విషయం తెలిసిందే.కానీ వారి ప్రేమకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రష్మిక విజయ్ స్పందిస్తూ మేము కేవలం స్నేహితుల మాత్రమే అని తెలిపారు.ఇది ఇలా ఉంటే మొన్నటికి మొన్న రష్మిక మందన, బెల్లంకొండ శ్రీనివాస్ ఇద్దరు రెండు మూడు సార్లు కలిసి కనిపించడంతో రష్మిక విజయ్ కు బ్రేకప్ చెప్పిందని, బెల్లంకొండ శ్రీనివాస్ తో వార్తలు వినిపించాయి.కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని చూస్తే అవన్నీ కూడా ఒట్టి వార్తలే అని తేలిపోయింది.

Telugu Restaurant, Tollywood-Movie

ఆ వీడియోలో విజయ్‌ దేవరకొండ, రష్మిక తమ కుటుంబాలతో కలిసి రెస్టారెంట్‌కు వెళ్లారు.వీడియో చూసిన అభిమానులు హమ్మయ్య, మిమ్మల్నిలా చూస్తుంటే కడుపు నిండిపోతోంది అని కామెంట్లు చేస్తున్నారు.ఆ వీడియో పై స్పందిస్తూ రెండు ఫ్యామిలీలు కలిసి వెళ్ళాయి అంటే పెళ్లి పనుల్లో మొదలు పెట్టారా?త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా అంటూ కామెంట్ చేస్తున్నారు.ఇంకొందరు ఈసారి ఏం చెప్పి తప్పించుకుంటారో అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం రష్మిక, విజయ్ లు కెరీర్ పరంగా బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube