ప్రభాస్ ఖాతాలో మరో రికార్డ్.. ఈ ఘనత సాధించిన ఏకైక టాలీవుడ్ హీరో ఇతడే!

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Pan India Star Prabhas ) సినిమా వస్తుంది అంటే డార్లింగ్ ఫ్యాన్స్ కు పండుగ అనే చెప్పాలి.ఇక ప్రభాస్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియన్ సినిమా ‘ఆదిపురుష్’ మూవీ ఇటీవలే జూన్ 16న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

 Prabhas Becomes The Only Tollywood Hero To Achieve This Record, Adipurush, Prabh-TeluguStop.com

ఎన్నో అంచనాల మధ్య పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ఓపెనింగ్స్ తో సెన్సేషన్ క్రియేట్ చేసింది.కొన్ని వేల థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డివైడ్ టాక్ అందుకుంది.

Telugu Adipurush, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Movie

రామాయణం ఆధారంగా తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ సినిమా రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ కు నోచుకోలేక పోయింది.బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) తెరకెక్కించిన ఈ సినిమాను దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటించగా కృతి సనన్ సీత పాత్రలో నటించింది.స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా నటించాడు.

అయితే ఓం రౌత్ రామాయణం మొత్తాన్ని మార్చి తీయడంతో పెద్ద ఎత్తున ట్రోల్స్ స్టార్ట్ అయ్యాయి.ఇదంతా పక్కన పెడితే ప్రభాస్ మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసాడు.

ఈయన నటించిన వరుసగా నాలుగు సినిమాలు కొత్త రికార్డును సృష్టించాయి.బాహుబలి, బాహుబలి 2 సాహో( Saaho ) తో పాటు ఆదిపురుష్ సినిమాలు ఓవర్సీస్ లో 3 మిలియన్ డాలర్ల మార్క్ దాటేశాయి.

Telugu Adipurush, Kriti Sanon, Om Raut, Prabhas, Saif Ali Khan-Movie

ఇలా వరుసగా 3 మిలియన్ మార్క్( 3 Million Dollar Mark ) టచ్ చేసి నాలుగు సినిమాలతో ప్రభాస్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసాడు.మరి ప్రభాస్ ఈ లిస్టులో మొదటి స్థానంలో నిలవగా.రామ్ చరణ్( Ram Charan ) 2 సినిమాలతో రెండవ స్థానంలో నిలువగా, ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేష్ బాబులు ఒక్కో సినిమాలతో మూడవ స్థానంలో ఉన్నారు.ఇక ఆదిపురుష్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 400 కోట్ల మార్క్ ను దాటేశాయి.

మరి క్లోజింగ్ కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube