విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించిన విషయం తెల్సిందే.అయితే ఈమద్య కాలంలో ఏదైనా సినిమా విడుదలకు కనీసం నెల రోజుల ముందు నుండే పబ్లిసిటీ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు.
కాని ఈ చిత్రం మాత్రం మూడు వారాల్లో రాబోతున్నా కూడా ఇంకా ఎలాంటి హడావుడి లేకపోవడం చర్చనీయాంశంగా ఉంది.
వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంలో మూడు విభిన్నమైన కథలను చూపించబోతున్నారు.విజయ్ దేవరకొండ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.ఇప్పటికే అందుకు సంబంధించిన లుక్స్ రివీల్ అయ్యాయి.
సినిమాపై జనాల్లో ఆసక్తి భారీగానే ఉంది.ఇలాంటి సమయంలో సినిమాను హడావుడిగా విడుదల చేసి క్యాష్ చేసుకోవాలి.
కాని చిత్ర యూనిట్ సభ్యులు మాత్రం సినిమాను మెల్లగా ప్రమోట్ చేద్దాంలే అనుకుంటున్నట్లుగా ఉన్నారు.
ఇప్పటి వరకు ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు కాకపోవడంతో కొందరు ఈ సినిమా వాయిదా పడిందా ఏంటీ అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.సినిమా షూటింగ్ ఇంకా పూర్తి అవ్వలేదు అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.ఈ పుకార్లకు అనుమానాలకు ఫుల్‌స్టాప్ పడాలి అంటే చిత్ర యూనిట్ సభ్యులు స్పందించాలంటూ నెటిజన్స్ కోరుకుంటున్నారు.